నిర్వాసితులకు న్యాయం చేయండి
చౌటుప్పల్ : రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలని కోరుతూ చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన నిర్వాసితులు బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఉత్తర భాగాన ఇష్టారీతిలో అలైన్‌మెంట్ మార్చారని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రోడ్డు మధ్య దూరం 40 కిలో మీటర్లు ఉండాలని, కానీ.. చౌటుప్పల్, భువనగరి, గజ్వేల్ ప్రాంతాల్లో 28 కిలో మీటర్లకు కుదించారని పేర్కొన్నారు. కొందరి ప్రయోజనాల కోసం అలైన్‌మెంట్ మార్పిడి చేయడంతో విలువైన వ్యవసాయ భూములు, నివాసగృహాలు, ఇళ్ల స్థలాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరం రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లు పలుకుతుందని, ప్రభుత్వం కేవలం రూ.30లక్షల నుంచి రూ.40లక్షల వరకు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. అంతేకాకుండా జంక్షన్‌ను విస్తరించడం వల్ల మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలు విడిపోతున్నాయన్నారు. అలైన్‌మెంట్ మార్చకపోతే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతాయన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని మంత్రిని వేడుకున్నారు. అందుకు మంత్రి స్పందిస్తూ ఉత్తరభాగంలో విచారణ చేయిస్తామని, నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు నిర్వాసితులు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి,చౌటుప్పల్ సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చి రెడ్డి, కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్‌గౌడ్, భూనిర్వాసితులు గుజ్జుల సురేందర్‌రెడ్డి, మారుపాక లింగం, చింతల ప్రభాకర్‌రెడ్డి, జాల శ్రీశైలం, జాల జంగయ్య, చింతల సుధాకర్‌రెడ్డి, బోరెం ప్రకాష్‌రెడ్డి, జాల వెంకటేష్,గుండెబోయిన గాలయ్య, జాల నర్సింహ, వేణు, జోసెఫ్, కార్తీక్, కనకరాజు, యాదయ్య తదితరులు ఉన్నారు.
ఫ బండి సంజయ్‌ను కలిసిన రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు
Comments
Please login to add a commentAdd a comment