సర్వేలో పొరపాట్లకు తావుండవద్దు
బీబీనగర్ : సమగ్ర కుటుంబ సర్వే వివరాల నమోదులో పొరపాట్లకు తావులేకుండా పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. మాస్టర్ ట్రైనర్లకు సర్వేపై బీబీనగర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై సర్వే లక్ష్యాలు, విధివిధానాలు, కార్యాచరణపై వివరించారు. జిల్లా కోడ్‌తో పాటు మండల, గ్రామ పంచాయతీ, హ్యాబిటేషన్ కోడ్ల తప్పక వేయాలని ఎన్యుమరేట్లకు సూచించారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి దోహదపడాలనే ఆశయంతో ప్రభుత్వం కుటుంబ సర్వే చేపడుతుందని, సకాలంలో ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం పరిశీలన
బ్రాహ్మణపల్లిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. కాంటా చేసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కేంద్రం సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, బీబీనగర్ మండల ప్రత్యేకాధికారి సుభాషిణి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment