ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
ఆలేరురూరల్ : వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు, కొల్లూరు కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. తాగునీరు, టెంట్, తేమ శాతం కొలిచే యంత్రాలు, గన్నీ బ్యాగ్స్, టార్పాలిన్లు, కాంటాలు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన వెంటనే కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించాలని, అన్ని రకాల రిజిస్టర్‌లను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ధాన్యం తరలింపులో వాహనాల కొరత రాకుండా చూడాలన్నారు. మ్యాచర్ ఽకొలతలు సరిగ్గా పనిచేస్తున్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు తహసీల్దార్ అంజిరెడ్డి, మార్కెట్ యార్డు సెక్రటరీ పద్మజ, మండల అధికారులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల పరిశీలన
భూదాన్‌పోచంపల్లి : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ జగదీశ్‌కుమార్ అన్నారు. పోచంపల్లి, గౌస్‌కొండ, వంకమామిడి గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూదాన్‌పోచంపల్లి తహసీల్దార్ మహేందర్‌రెడ్డి, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆయన సందర్శించారు. ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లు, ఎగుమతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తిచేయాలని నిర్వాహకులను ఆదేశించారు.
అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment