ఎస్సెస్సీలో ప్రథమ స్థానంలో నిలపాలి
భువనగిరిటౌన్ : ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల్లో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేవిధంగా చూడాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. మంగళవారం భువనగిరిలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ అధ్యక్షతన ఎంపీఓ, ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ ప్రత్యేక అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతిరోజు ఒక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని తెలిపారు. డీఈఓ కె.సత్యనారాయణ మాట్లాడుతూ డిసెంబర్ 4వ తేదీన నిర్వహించనున్న నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రశాంత్‌రెడ్డి, డీసీఈబీ సెక్రటరీ పాండు, రఘురాంరెడ్డి పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
చౌటుప్పల్ రూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. చౌటుప్పల్ మండలంలోని జైకేసారం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతరావు మంగళవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ హరికృష్ణ, ఏఓ ముత్యాల నాగరాజు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎం.హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment