పీఈటీ రవీందర్‌కు డాక్టరేట్
ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలంలోని పల్లెర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా పని చేస్తున్న జెట్ట రవీందర్ వ్యాయామ విద్యలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. సీనియర్ ప్రొఫెసర్ బి.సునీల్‌కుమార్ పర్యవేక్షణలో (ఎ కంపారేటివ్ స్టడీ ఆన్ ఫిజికల్ ఫిట్‌నెస్ అమాంగ్ ది కబడ్డీ అండ్ ఖోఖో బాయ్స్ బిట్విన్‌ది ఏజ్ గ్రూపు 14–16 ఈయర్స్ ఇన్ తెలంగాణ స్టేట్) అంశంపై అధ్యయన పత్రాలు సమర్పించారు. ఈమేరకు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పీహెచ్‌డీని అందజేశారు.
జానకిపురం వాసికి డాక్టరేట్
అడ్డగూడూరు: వలిగొండ మండలం పల్లెర్ల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అడ్డగూడూరు మండలంలోని జానకిపూరం గ్రామానికి చెందిన బోనాల మహేష్ ఉస్మానియా యూనివర్సీటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. సీనియర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ పర్యవేక్షణలో (ఎఫెక్ట్ ఆఫ్ రెసిస్టన్స్ టైనింగ్ ఫర్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ మోటర్ ఫిట్నెస్ అండ్ ఫిజియోలాజికల్ మేరియబుల్ అమోంగ్ కబడ్డీ ప్లేయర్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ) అంశంపై పరిశోధన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎల్‌బీ లక్ష్మీకాంత్ రాథోడ్, పాలమూరు మూనివర్సిటీ మాజీ వీసీ, ప్రొఫెసర్ రాజేష్ కుమార్, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రొఫెసర్ దీప్లా చేతుల మీదుగా బుధవారం డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment