నిలిచి ఉన్న బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
కేతేపల్లి: ఇంజన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంలో హైవేపై నిలిచిపోయిన ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సును మరో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటనలో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున కేతేపల్లిలోని 65 నంబరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఏపీలోని నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. కేతేపల్లి వద్దకు చేరుకోగానే ఇంజన్‌లో సాంకేతిక లోపం ఏర్పడి రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో సిబ్బంది బస్సులోని ప్రయాణికులను మరో బస్సులోకి ఎక్కించి గమ్యస్థానాలకు పంపించారు. అదే మార్గంలో వస్తున్న ఉయ్యూరు డిపోకు చెందిన మరో ఆర్టీసీ లగ్జరీ బస్సు కేతేపల్లి వద్ద రోడ్డుపై నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సీహెచ్ శ్రీనివాస్‌రావు రెండు కాళ్లు విరిగిపోయాయి. బస్సులో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన పి.సూర్యసాయి, తిరుపతమ్మ, ఎం.రజనీలకు స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కేతేపల్లి ఎస్‌ఐ శివతేజ తెలిపారు.
ఫ డ్రైవర్‌తో పాటు ముగ్గురు
ప్రయాణికులకు గాయాలు
Comments
Please login to add a commentAdd a comment