మోతె: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మోతె మండల పరిధిలోని గోల్‌తండాలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బానోతు నాగరాజు(25) గత రెండు సంవత్సరాల క్రితం పొలం పనులు చేస్తుండగా కాలు జారి కింద పడడంతో అనారోగ్యం బారిన పడ్డాడు. గత నెల 26న ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం ఇంటికి వచ్చాడు. గత రెండు రోజుల క్రితం ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో నాగరాజును డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి అన్న బానోతు శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు మోతె ఎస్సై యాదవేందర్‌రెడ్డి తెలిపారు.
రేషన్ బియ్యం పట్టివేత
హుజూర్‌నగర్ (చింతలపాలెం): చింతలపాలెం మండలంలోని కొత్తగూడెంతండాలో అక్రమంగా నిల్వ ఉంచిన 8.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ అంతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెంతండాలో సైదా ఇంటి వద్ద రేషన్ బియ్యం నిల్వ చేశారనే సమాచారంతో పోలీసులు తనిఖీ చేసి 8.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆరా తీయగా బియ్యం గుగులోత్ నాగరాజుకు చెందినవిగా గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
తండ్రిని హత్యచేసిన కొడుకు, కోడలు రిమాండ్
మునుగోడు: కుటుంబ తగాదాల కారణంగా కన్న తండ్రిని గొడ్డలితో హత్యచేసిన కొడుకు, కోడలిని మునుగోడు పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. చండూరు సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలంలోని చొల్లేడు గ్రామానికి చెందిన కట్కూరి రామచంద్రాన్ని అతడి పెద్ద కుమారుడు నర్సింహ, కోడలు రేణుక 11వ తేదీన కుటుంబ కలహాల కారణంగా గొడ్డలితో నరికి చంపారు. ఈమేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి వారిని విచారించి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment