భువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలోని బాలసదన్‌లో అక్టోబర్ 14వ తేదీన జరిగిన లైంగిక వేధింపుల ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించారనే ఆరోపణల్లో ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి నర్సింహారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వుల ప్రతులను ఉద్యోగులు బాలల పరిరక్షణ అధికారి పి.సైదులు, బాలసదన్ పర్యవేక్షణ అధికారి లలితకు అందజేశారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బాలసదన్‌లో గత నెల 14న జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వెంకట్‌రెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ బాలిక బాలల పరిరక్షణ అధికారికి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు సంబంధించి స్వచ్ఛంద సంస్థలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులు విచారణ చేసి 20న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో కేసు నమోదు చేసి వెంకట్‌రెడ్డిని రిమాండ్‌కు పంపించారు. ఈ విషయమై కలెక్టర్ విచారణ చేయించి ఉద్యోగులు పి.సైదులు, లలిత తప్పిదాన్ని గుర్తించి ఇరువురిని విధుల నుంచి తొలగించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ ఉద్యోగి పీఓఐసీ అలివేలు పాత్రపై మరోసారి విచారించాలని ఆర్డీఓ కృష్ణారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. అలాగే బాల సదనం సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఐసీడీఎస్ రెగ్యులర్ ఉద్యోగి మహాలక్ష్మిని జిల్లా సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌కు సరెండర్ చేశారు.
మరో ఉద్యోగిపై విచారణకు ఆదేశాలు
సూపర్‌వైజర్‌పై శాఖాపరమైన చర్యలు
బాలసదన్‌లో జరిగిన ఘటనపై
చర్యలు తీసుకున్న కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment