యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టి గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవను ఆలయ మాడవీధిలో భక్తుల మధ్య ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
నాణ్యత లోపిస్తే చర్యలు
మోటకొండూర్ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేయాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ వీరారెడ్డి హెచ్చరించారు. శనివారం మోటకొండూరులోని బీసీ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. వంట సరుకులు, కిచెన్‌ను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందజేయాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం, భోజనంపై పర్యవేక్షణ ఉంచాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు వైద్యుడు విజయ్ బీసీ గురుకుల, ఎస్సీ హాస్టల్‌ను సందర్శించి భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీటీ జయలక్ష్మి, ప్రిన్సిపాళ్లు జ్యోతి, స్వాతి, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆరోగ్య కేంద్రం తనిఖీ
వలిగొండ : మండలంలోని వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామకృష్ణ శనివారం సందర్శించారు. వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించాలని, వ్యాక్సినేషన్ చేయడానికి ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని వైద్యులకు సూచించారు. వాక్సిన్ నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య సిబ్బంది సత్యనారాయణ, ప్రసిద్దు, రమేష్, ప్రవీణ్‌రెడ్డి, ఏఎన్‌ఎంలు
మాక్ టెస్టులకు దరఖాస్తుల స్వీకరణ
నల్లగొండ: గ్రూప్– 2 పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ యువతీ యువకులకు రెండు ఫ్రీ ఫుల్ లెన్త్ మాక్ టెస్టులు నిర్వహించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నల్లగొండ జిల్లా మైనార్టీ సంక్షమ శాఖ అధికారి విజయేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను మైనార్టీసంక్షేమ శాఖ అధికారి కార్యాలయం, కలెక్టరేట్ కాంప్లెక్స్ నల్లగొండలో ఈ నెల 29లోగా సమర్పించాలని పేర్కొన్నారు. మాక్ టెస్టు డిసెంబర్ 2, 3, 9, 10 తేదీల్లో ఉదయం 10:30 నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నల్లగొండలో నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు 94943 45471, 79811 96060 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment