డయాలసిస్ రోగులకు ఊరట
పేషెంట్లు సద్వినియోగం చేసుకోవాలి
రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను 29న స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం చేతులమీదుగా ప్రారంభిస్తాం. రామన్నపేట పరిసర ప్రాంత పేషెంట్లు సుదూర ప్రాంతాలకు వెళ్లే బాధ తప్పుతుంది. జిల్లాలోని నాలుగు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు పనిచేస్తాయి.
– డాక్టర్ చిన్నానాయక్
డీసీహెచ్‌ఎస్, యాదాద్రి భువనగిరి
రామన్నపేట: రామన్నపేట పరిసర ప్రాంత ప్రజలకు డయాలసిస్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆస్పత్రిలో పురుషుల వార్డును ఆధునీకరించి, ఐదు బెడ్లను ఏర్పాటు చేశారు. ఒక బ్లాక్‌లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ నిర్వహణ బాధ్యత సాప్ సంస్థకు అప్పగించారు. రోజుకు 15 నుంచి 20మందికి డయాలసిస్ చేసే అవకాశం ఉంది. డయాలసిస్ నిర్వహణకు అవసరమైన స్వచ్ఛమైన జలంకోసం ప్రత్యేకంగా నీటిశుద్ధి యంత్రం బిగించారు. ఈ సెంటర్‌ను 29న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆస్పత్రివర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు. డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి వస్తుండడంతో డయాలసిస్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే పేషెంట్లు, సహాయకులకు తిప్పలు తప్పనున్నాయి.
జిల్లాలో నాలుగో డయాలసిస్ సెంటర్
డయాలసిస్ అనేది మూత్రపిండాలు విఫలమైన వ్యక్తులకు చేసే చికిత్స. ఇప్పటికే భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు చౌటుప్పల్, ఆలేరు ప్ర భుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. ఒక్కోసెంటర్‌లో సుమారు 60మంది పేషెంట్లకు డయాలసిస్ సేవలు అందుతున్నాయి. రామన్నపేటలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌తో మరో 60మందికి అదనంగా సేవలు అందనున్నాయి.
గతంలో సుదూర ప్రాంతాలకు..
రామన్నపేట మండల ప్రజలతో పాటు వలిగొండ, చిట్యాల, నార్కట్‌పల్లి, మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం) మండలాలకు చెందిన డయాలసిస్ పేషెంట్లు హైదరాబాద్, నల్లగొండ, భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్ సెంటర్లకు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. వారానికి రెండు మూడు పర్యాయాలు దూరంగా ఉన్నటువంటి సెంటర్లకు వెళ్లి రావడం వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. రామన్నపేటలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుతో వారికి వ్యయ ప్రయాసలు తప్పనున్నాయి.
ఫ రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో
డయాలసిస్ సెంటర్ ఏర్పాటు
ఫ 29 నుంచి సేవలు ప్రారంభం
ఫ దూర ప్రాంతాలకు వెళ్లే
పేషెంట్లకు తప్పనున్న తిప్పలు
Comments
Please login to add a commentAdd a comment