నేడు జిల్లా పరిషత్ సమీక్ష సమావేశం
భువనగిరిటౌన్: జిల్లా ప్రజా పరిషత్ సమీక్ష సమావేశం గురువారం నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శోభారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. జిల్లా ప్రజా పరిషత్‌కు కలెక్టర్ ప్రత్యేక అధికారిగా ఉంటారని, ఆయన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.
విద్యార్థులకు
పౌష్టికాహారం అందించాలి
మోటకొండూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బుధవారం మోటకొండూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎంఎఫ్ జిల్లా కార్యదర్శి కలకోట రాజగోపాల్, మండల అధ్యక్షుడు వడ్డెపల్లి సుదర్శన్, ఎండీ ఫరూక్, ఉపాధ్యాయులు చొల్లేటి శ్రావణ్‌కుమార్, సుధారాణి, విశ్వరూపం, ప్రభాకర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రమేష్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో నిత్యపూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్య పూజలు విశేషంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన ఆర్చకులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాతం, అర్చన, అభిషేకం నిర్వహించారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. ఇక ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం జరిపించి, ఆలయ ద్వార బంధనం చేశారు.
29న జిల్లా స్థాయి
క్రీడాజట్ల ఎంపిక
ఆలేరురూరల్: ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్ 14 ఫుట్‌బాల్ విభాగంలో బాల, బాలికల క్రీడా జట్టు ఎంపిక పోటీలు ఆలేరు పట్టణ కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో ఈనెల 29న నిర్వహిస్తున్నట్లు జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి బెజ్జం బాలకృష్ణ బుధవారం తెలిపారు. 2011 జనవరి 1 తర్వాత జన్మించిన బాల, బాలికలు బోనోఫైడ్, ఆధార్ కార్డ్‌తో ఎంపిక పోటీలో పాల్గొనాలని పేర్కొన్నారు.
పల్లె దవాఖాన పరిశీలన
భువనగిరిరూరల్: భువనగిరి మండలం అనంతారం గ్రామంలో ఉన్న పల్లె దవాఖానాను జిల్లా మాత శిశు సంక్షేమ ఆరోగ్య అధికారి యశోధ బుధశారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి బుధవారం నిర్వహిస్తున్న విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే లో భాగంగా ప్రతి పిల్లవాడికి సంపూర్ణ టీకాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్ మురళీమోహన్, హెల్త్ ఎడ్యుకేటర్ వసంత, శ్రీనివాస్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ వసుధ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రైస్తవులు దరఖాస్తు
చేసుకోవాలి
భువనగిరిటౌన్: క్రిస్మస్ 2024 వేడుకల సందర్భంగా క్రైస్తవులు, క్రైస్తవ సంస్థలకు అవార్డులు ప్రకటించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి యాదయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవ, విద్య, వైద్య, సాహిత్యం, కళలు, క్రీడలు మొదలగు వాటిలో సేవలందించిన క్రైస్తవులు, సామాజిక సేవ, విద్య, వైద్య రంగాల్లో విశేష సేవలందించిన క్రైస్తవ సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి కార్యాలయంలో డిసెంబర్ 5వ తేదీలోగా అందించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment