హాస్టళ్లలో అధికారుల రాత్రి నిద్ర
సాక్షి, యాదాద్రి: ఇటీవల ప్రత్యేకాధికారులు వసతి గృహాల్లో రాత్రి బస చేయాలని కలెక్టర్ ఆదేశించడంతో బుధవారం రాత్రి జిల్లా యంత్రాంగం రాత్రి బస చేసింది. కలెక్టర్ హనుమంతరావుతో సహా వివిధ శాఖల అధికారులు జిల్లాలోని 89 వసతి గృహాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వసతి గృహంలో సమస్యలను అడిగి తెలుసుకుని విద్యార్థులతో కలిసి రాత్రి నిద్ర చేశారు. కాగా.. కలెక్టర్ సంస్థాన్‌నారాయణపురం ఎస్సీ బాలుర వసతి గృహంలో రాత్రి నిద్ర చేశారు. అంతకు ముందు ఆయన వసతి గృహంలో విద్యార్థుల వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
నెలకు ఒకసారి
హాస్టల్ నిద్ర చేస్తాం : కలెక్టర్
సంస్థాన్‌నారాయణపురం ఎస్సీ బాలుర వసతి గృహంలో కలెక్టర్ రాత్రి నిద్ర సందర్భంగా ఆయన మాట్లాడారు. నెలకు ఒకసారి హాస్టల్ నిద్ర నిర్వహిస్తామని తెలిపారు. హాస్టళ్లలో సమస్యలను ధీర్ఘకాలిక, తక్షణ సమస్యలుగా విభజించి పరిష్కరమిస్తామని చెప్పారు. జిల్లాలోని 678 ప్రభుత్వ పాఠశాల్లో కూడా ప్రత్యేకాధికారులను నియమించి, మధ్యాహ్న భోజనం పరిశిలిస్తామని తెలిపారు. వార్డెన్‌లు తప్పనిసరిగా హాస్టల్‌లో ఉండాలని ఆదేశించారు. తల్లిదండ్రులు విద్యార్థులను వసతిగృహాలకు రాని విద్యార్థులను తల్లిదండ్రులు పంపించాలని కలెక్టర్ కోరారు. పీహెచ్, సీహెచ్‌సీ, అంగన్‌వాడీలను కూడా తనిఖీ చేస్తామని పేర్కొన్నారు.
ఫ జిల్లాలోని 89 వసతి గృహాలను
సందర్శించిన అధికార యంత్రాంగం
ఫ సంస్థాన్‌నారాయణపురం ఎస్సీ బాలుర హాస్టల్‌లో రాత్రి బస చేసిన కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment