కందికాయలకు భలే డిమాండ్
నల్లగొండ రూరల్: కందికాయల్లో ఔషధ గుణాలు ఉండడంతో గ్రామీణ ప్రజలు వాటిని ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు. అయితే వీటి ప్రయోజనాల గురించి తెలిసిన కొంతమంది వ్యాపారులు ఆటోల్లో పచ్చి కందికాయలు తీసుకొచ్చి పట్టణాల్లో కిలోకు రూ.80 చొప్పున అమ్ముతున్నారు. పచ్చి కందికాయలను ఉప్పు వేసి ఉడికించడం, కాల్చి తినడం వల్ల ఆరోగ్యం పరిఫుష్టిగా ఉంటుంది. గర్భిణుల్లో పిండం ఎదుగుదలకు దోహదపడుతుంది. చిన్నారులు బలంగా ఎదగడం, జ్ఞాపకశక్తి పెరగడం, జీర్ణక్రియ పెరుగుతుంది. ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్, విటమిన్ బి1, బి2, బి5 లభిస్తుంది. చెడు కొవ్వును నివారిస్తుంది. ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది. సీజనల్‌గా వచ్చే వ్యాధులను నిరోధిస్తుంది. కండరాలు బలంగా ఉండేందుకు, ఎముకల ఎదుగుదలకు కంది కాయలు ఉపయోగపడతాయి. శరీర బరువును తగ్గిస్తుంది. శరీరంలోని రక్తం అన్ని భాగాలకు సరఫరా అయ్యేలా తోడ్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కంది ఆకులను కషాయంగా చేసుకుని తాగుతారు. దీంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పొట్ట తగ్గుతుంది. ప్రకృతి సహజంగా లబించే కందికాయల్లో పురుగు మందు అవశేషాలు ఉండవు. ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు ఉండటంతో కందికాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. రైతులు కంది సాగు చేస్తూ హైదరాబాద్ మార్కెట్‌కు తరలించి లాభాలు పొందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పచ్చి కంది వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించి కంది సాగును ప్రోత్సహిస్తే రైతులు తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని పలువురు అంటున్నారు.
ఆరోగ్య సంజీవని కందికాయలు
కందికాయలు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలున్నాయి. పచ్చి కందికాయలు కాల్చి, ఉప్పేసి ఉడకబెట్టి తింటారు. కందికాయల్లో అనేక పోషకాలు ఉండటంతో పాటు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎదిగే చిన్నారులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది.
– విఠల్, వైద్యుడు
ఫ ఔషధ గుణాలు ఉండడంతో
కొనేందుకు ఆసక్తి చూపుతున్న పట్టణవాసులు
ఫ గ్రామాల నుంచి ఆటోల్లో తీసుకొచ్చి అమ్ముతున్న వ్యాపారులు
Comments
Please login to add a commentAdd a comment