భానుపురి (సూర్యాపేట): ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని సుప్రీం కోర్టే వ్యాఖ్యానించిందని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ పేపర్‌ను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చిందని తెలిపారు. ఈవీఎంల పనితీరుపై పిటిషనర్ డాక్టర్ కౌల్ చేసిన వాదనల్లో వాస్తవాలు లేవని న్యాయస్థానం పేర్కొందన్నారు. బ్యాలెట్ పేపర్ వ్యవస్థను ప్రవేశపెట్టాలనే అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment