తెల్లకార్డు లేక.. పథకాలు అందక!
ఆలేరురూరల్ : నిరుపేదలకు రేషన్ కార్డుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడిచినా మోక్షం కలగడం లేదు. ఆహారభద్రతతో పాటు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డే కీలకం. కార్డులు జారీకాక అనేక కుటుంబాలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నాయి.
దరఖాస్తులు ఇలా..
యాదాద్రి జిల్లాలో 515 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 2,16,841 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 13,734 అంత్యోదయ కార్డులు, 6,60,054 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి నెలా 42,16,320 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. కాగా డిసెంబర్ 2016నుంచి ఇప్పటి వరకు 11వేల మందికి పైనే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 7,750 దరఖాస్తులను ఆమోదించగా, 3,250 మంది దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు.
అన్నింటికీ తెల్లరేషన్ కార్డే ప్రామాణికం
సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ సేవలకు, విద్యార్థులు ఉపకార వేతనాలు పొందడానికి ఆదాయ, ఇతర ధ్రువీకరణ పత్రాలకు తెల్లరేషన్ కార్డు అత్యవసరమవుతోంది. వీటితో పాటు ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రేషన్‌కార్డు ప్రామాణికం అవుతుంది. దీంతో వేలాది మంది అర్హత ఉన్నా సంక్షేమ పథకాలను పొందడం లేదు. చివరిసారి 2021లో అప్పటి ప్రభుత్వం కొందరికి మాత్రమే ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. ఆ తర్వాత పంపిణీ నిలిచిపోయింది.
కార్డులకు పెరుగుతున్న డిమాండ్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరించింది. ఆరు గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో వీటికి డిమాండ్ మరింత పెరిగింది. రేషన్‌కార్డులు జారీ చేస్తామని మూడు నెలల క్రితం ప్రకటించినా ఇప్పటి వరకు ప్రక్రియ ప్రారంభించలేదు.
ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఇబ్బంది అవుతుంది
కొత్త రేషన్‌కార్డు కోసం 2019లో దరఖాస్తు చేకున్నా. 2021 దరఖాస్తును తిరస్కరించారు. తిరిగి మళ్లీ దరఖాస్తు చేశాను. ఇప్పటివరకు కార్డు జారీ చేయకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నాన. రేషన్ సహా ఆస్పత్రులకు వెళ్లినప్పుడు ఇబ్బంది పడుతున్నాం.
–మారగాని మధు, ఆలేరు, మంతపురి
ప్రభుత్వానికి నివేదించాం
దళల వారీగా రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. ఇదివరకు రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ప్రభుత్వానికి నివేదించాం. ఆదేశాలు రాగానే కార్డులు జారీ చేస్తాం.
–అంజిరెడ్డి, తహసీల్దార్, ఆలేరు మండలం
రేషన్‌కార్డుల కోసం ఎదురుచూపులు
ఫ ఏళ్లుగా జారీ చేయకపోవడంతో ఇబ్బందులు
ఫ ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న నిరుపేదలు
ఫ పెండింగ్ దరఖాస్తులు 11వేలకు పైనే..
Comments
Please login to add a commentAdd a comment