పురుగులు పట్టిన బియ్యం.. ఉడికీఉడకని అన్నం.. కుళ్లిన కోడిగుడ్లు.. శనగపిండి కలిపిన చారు.. నీళ్లలా పచ్చి పులుసు, నాణ్యతలేని కూరగాయలు.. ఇదీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనం. నాసిరకంగా ఉంటున్న భోజనాన్ని తినలేకపోతున్నామని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. కొందరు సాయంత్రం వరకు ఖాళీ కడుపుతో ఉంటుండగా.. మరికొందరు హోటళ్లకు వెళ్లి అల్పాహారం తింటున్నారు. ఇంకొందరు ఇంటినుంచి భోజనం తెచ్చుకుంటున్నట్లు గురువారం ‘సాక్షి’ విజిట్‌లో గుర్తించారు. –సాక్షి, యాదాద్రి
Comments
Please login to add a commentAdd a comment