No Headline
● చౌటుప్పల్ జిల్లా పరిషత్ పాఠశాలలో 314 మంది ఉన్నారు. రోజూ 120నుంచి 150 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలలో భోజనం చేస్తున్నారు. మిగతా విద్యార్థులు ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తున్నారు. మెనూ సరిగా అమలు కావడం లేదు. అరటిపండు అందజేస్తలేరు.
● అడ్డగూడూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 86 మంది విద్యార్థులు ఉండగా 56 మంది హాజరయ్యారు. అన్నం ముద్దలుగా ఉంది. కూరలు రుచికరంగాలేవని, రోజూ ఇదే పరిస్థితి అని విద్యార్థులు తెలిపారు.
● భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యతగా లేవు. ఏజెన్సీనుంచే నాసిరకం బియ్యం వస్తుండడంతో అన్నం మెత్తగా అవుతుంది. నాసిరకం భోజనాన్ని కడుపునిండా తినలేక పారబోస్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకొని పాఠశాలలో చేసిన కూరలు వేసుకుంటున్నారు.
ఫ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లోపిస్తున్న మధ్యాహ్న భోజనం
ఫ తినలేకపోతున్నామని విద్యార్థుల గగ్గోలు
ఫ సాయంత్రం వరకు ఖాళీ కడుపుతోనే..
ఫ కొందరు విద్యార్థులు హోటళ్లకు వెళ్లి టిపిన్
ఫ మొక్కుబడిగా మెనూ అమలు
Comments
Please login to add a commentAdd a comment