భూతగాదాలతో దాయాదుల మధ్య ఘర్షణ
డిండి: భూతగాదాలతో దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చందంపేట మండలం ఎలమలమంద గ్రామ పంచాయతీ పరిధిలోని చాపలగేటుతండా వద్ద బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాపలగేటుతండాకు చెందిన కేతావత్ సామ్యా(55) అదే తండాకు చెందిన కేతావత్ హన్మ, భానవత్ హన్మ కుటుంబాల మధ్య కొన్ని సంవత్సరాలుగా భూతగాదాలు జరుగుతున్నాయి. అదే తండాకు చెందిన కేతావత్ లక్ష్మి నుంచి కొనుగోలు చేసిన దాదాపు రెండున్నర ఎకరాల వ్యవసాయ పొలాన్ని బుధవారం కేతావత్ సామ్యా దున్నాడు. సామ్యా దున్నతున్న పొలం ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని కేతావత్ హన్మా, భానావత్ హన్మ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అట్టి భూమి పట్టాదా, రెస్ట్ భూమా తేలే వరకు వ్యవసాయ పనులు నిలిపివేయాలని సామ్యాకు చెప్పి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా తాను కొనుగోలు చేసిన భూమిని దున్నతుంటే ఫారెస్ట్ అధికారులకు ఎందుకు ఫోన్ చేశారని సామ్యా కుటుంబ సభ్యులు హన్మను అడిగారు. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో సామ్యా తలకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌కు తరలించగా అప్పటి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గాయాలపాలైన కేతావత్ మహేందర్, లోకేష్, నాగా, నెహ్రూ, హన్మను దేవరకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. మృతుడి కుమారుడు మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.
ఫ కర్రలు, గొడ్డళ్లతో ఒకరిపై ఒకరు దాడి
ఫ తీవ్రంగా గాయపడి ఒకరు మృతి
Comments
Please login to add a commentAdd a comment