వచ్చేనెల 4న జాతీయ సాధన సర్వే పరీక్ష
భువనగిరి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ సాధన సర్వే (నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే) పరీక్ష నిర్వహిస్తోంది. వచ్చే నెల 4న పరీక్ష నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లపై యంత్రాంగం దృష్టి పెట్టింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 132 మంది క్షేత్ర పరిశోధకులను ఎంపిక చేశారు. 86 మంది పరిశీలకులను నియమించారు.
మరోసారి శిక్షణ
జిల్లాలో 3, 6, 9 తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను సర్వే చేయనున్నారు. మూడో తరగతి గణితం, ఈవీఎస్, ఆంగ్లం, తెలుగు, 6 వతరగతి విద్యార్థులకు గణితం, ఆంగ్లం, ఈవీఎస్, తెలుగు, 9వ తరగతి విద్యార్థులకు సామాన్య, సాంఘిక, తెలుగు, గణితం, ఆంగ్లం సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు ఈ నెల 26న క్షేత్ర పరిశీలకులకు శిక్షణ ఇవ్వగా రెండు, మూడు రోజుల్లో మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు.
ఫ ఇప్పటికే క్షేత్ర పరిశోధకులకు మొదటి విడత శిక్షణ పూర్తి
ఫ రెండు, మూడు రోజుల్లో
మరోసారి శిక్షణ
పరీక్షలకు సన్నద్ధం చేయాలి
సర్వే పరీక్షలో విద్యార్థులు ప్రతిభను వెలికితీసేందుకు అవకాశం ఉంటుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులు పరీక్ష రాసేలా ప్రధానోపాధ్యాయులు సహకరించాలి. పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచనలు చేయాలి. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలి.
– సత్యనారాయణ, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment