అడ్డగూడూరు: అంగన్‌వాడీ కార్యకర్తలలు, ఆయాలకు ప్రభుత్వం గత నాలుగు నెలల క్రితం రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జిల్లాలో 65 ఏళ్లు పై బడిన 20 మంది అంగన్‌వాడీ టీచర్లు, 109 మంది అయాలు ఉద్యోగ విరమణ పొందారు. అయితే రిటైర్మెంట్ ప్రకటించి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారికి బెనిఫిట్స్ అందలేదు. పింఛన్ మంజూరు కాలేదు. కొన్ని దశాబ్దాలుగా అరకొర వేతనంతో నెట్టుకొస్తున్న వారికి ప్రస్తుతం ఆ జీతాలు కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హామీలను విస్మరించిన ప్రభుత్వం...
ప్రభుత్వం ముందుగా ఉద్యోగ విరమణ పొందిన అంగన్‌వాడీ టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50 వేలు ఇస్తామని ప్రకటించింది. దీనిపై అంగన్‌వాడీలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ బెనిఫిట్స్ పెంచాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ విరమణ పొందిన అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష బెనిఫిట్స్ అందిస్తామని స్వయంగా మంత్రి సీతక్క ప్రకటించారు. అయితే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ సంగతి అటుంచితే నాలుగు నెలల గడుస్తున్నా కనీసం పింఛన్లు కూడా మంజూరు చేయలేదని వాపోతున్నారు.
ఫ పింఛన్‌కు నోచుకోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు
ఫ నాలుగు నెలలు గడుస్తున్నా
నిర్ణయం తీసుకోని ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment