చెరువు అలుగు పోసింది.. ధాన్యం నీటిపాలైంది
యాదగిరిగుట్ట: ఎగువ నుంచి కాలువ నీళ్లతో చెరువు అలుగుపోయగా.. చెరువు సమీపంలోని వెంచర్లో ఆరబోసిన ధాన్యం నీటి మునిగింది. ఇటీవల సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ నుంచి యాదగిరిగుట్ట పట్టణంలోని నల్లచెరువుకు గోదావరి జలాలు చేరుతున్నాయి. చెరువు నిండి శనివారం అలుగుపోసింది. కాగా యాదగిరిగుట్ట శివారు పాతగుండ్లపల్లికి చెందిన తాడూరి రాంచందర్ వరి కోసి, అక్కడే ఉన్న ఓ వెంచర్లో ధాన్యం ఆరబోశాడు. చెరువు అలుగునీళ్లు వెంచర్‌ను ముంచెత్తాయి. అలుగు నీళ్లు వెళ్లే కాల్వ సరిగా లేకపోవడం, చెత్తాచెదారంతో నిండిపోవడంతో నీరంతా వెంచర్లోకి చేరింది. ఈ సమయంలో అక్కడే ఆరబోసినధాన్యం పూర్తిగా తడిసిపోయింది. సుమారు 55 బస్తాల ధాన్యం నీటిపాలైందని రైతు రాంచందర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment