నేడు డయల్ యువర్ డీఎం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో మంగళవారం ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తామని డిపో మేనేజర్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు, ప్రయాణికులు 99592 26310కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని.. సలహాలు, సూచనలు ఇవ్వాలని డీఎం సూచించారు.
శివుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం విశేష పూజలు చేపట్టారు.శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన తదితర పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపం, ముఖ మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర పూజలు నిర్వహించారు.
రెవెన్యూ డివిజన్
చేయాలని కలెక్టర్‌కు వినతి
మోత్కూరు : మోత్కూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ హనుమంతరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రజల సౌలభ్యం కోసం గత ప్రభుత్వం 5 మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వెనుకబడిన మోత్కూరు మండలాన్ని కూడా రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. కార్యక్రమంలో కలిమెల నర్సయ్య, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలి
యాదగిరిగుట్ట : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సి పాలిటీల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.రవిచంద్రన్, కార్యదర్శి వనంపల్లి జైపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలోని సీపీఐ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడారు. కనీసం వేతనం రూ.26 ఇవ్వాలని, ప్రతి నెలా 2వ తేదీన వేతనాలు చెల్లించాలని, పండుగలు, జాతీయ సెలవులను వర్తింపజేయాలని, ఒకటే షిఫ్టు అమలు చేయాలని కోరారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 మంది కార్మికుల పేర్లను రిజిస్టర్‌లో నమోదు చేయాలని అధికా రులను కోరారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య, సీపీఐ మండల కార్యదర్శి కల్లెపల్లి మహేందర్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేరబోయిన మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
రగ్బీ పోటీలకు ఎంపిక
రామన్నపేట : మండలంలోని వెల్లంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి గూని అభినయశ్రీ జాతీయస్థాయి రగ్బీబాల్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం సురేందర్‌రెడ్డి తెలిపారు. పదవ తరగతి చదువుతున్న అభినయశ్రీ.. ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు బిహార్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. అభినయశ్రీ, ఫిజికల్ డైరెక్టర్ రేణుకను సోమవారం హెచ్‌ఎం సురేందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు సత్తిరెడ్డి, పారిజాత, యాదగిరి, సీనారెడ్డి, హేమలత, స్వప్న అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment