ఆలకించి.. భరోసానిచ్చి
భువనగిరిటౌన్ : ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలంటూ, సంక్షేమ పథకాలు అందడం లేదంటూ.. భూ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా నలుమూలల నుంచి సోమవారం కలెక్టరేట్‌కు బాధితులు తరలివచ్చారు. ప్రజావాణిలో కలెక్టర్‌కు అర్జీలు అందజేసి సమస్యలు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండడం లేదని, మీరైనా పరిష్కరించాలని వేడుకున్నారు. వివిధ సమస్యలపై 55 అర్జీలు వచ్చాయి. ఇందులో అత్యధికంగా భూ సమస్యలకు సంబంధించి 36 వినతులు ఉన్నాయి. మిగతా వాటిలో పంచాయతీరాజ్ 6, హౌసింగ్ 5, సంక్షేమ శాఖ 3, మున్సిపాలిటీ 2, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 2, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఒకటి చొప్పున అర్జీలు వచ్చాయి. కలెక్టర్ హనుమంతరావు అర్జీలు స్వీకరించి ఆయా శాఖలకు రెఫర్ చేశారు. పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరా రెడ్డి, గంగాధర్, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
● భువనగిరిలోని సఖి కేంద్రంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ నిరుద్యోగ యువకులు సుధాకర్, మదు, నరేష్ వినతి పత్రం అందజేశారు. స్థానికేతరులకు ప్రాధాన్యమిస్తున్నారని, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిలో ముగ్గురూ ఇతర జిల్లాల వ్యక్తులే ఉన్నట్లు పేర్కొన్నారు.
● నా ఇంటి నంబర్ మరొకరి పేరున ఉందని.. సరి చేయాలని పంచాయతీ కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాంకు చెందిన చంద్రయ్య ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. విచారణ చేయాలని ఎంపీడీఓ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చానని, ప్రజావాణిలో కూడా నెల రోజుల క్రితం అర్జీ పెట్టానని తెలిపారు.
● కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కమిటీ నాయకులు మామిడాల భిక్షపతి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు జనార్దన్, కేమిడి ఉప్పలయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రజావాణిలో వినతులు స్వీకరించి,
సమస్యలు తెలుసుకున్న కలెక్టర్
ఫ అర్జీలను పెండింగ్ ఉంచవద్దని అధికారులకు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment