నాణ్యమైన భోజనం అందజేయాలి
భువనగిరి : విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందజేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సోమవారం భువనగిరి మండలం రాయగిరి పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. కిచెన్, కూరగాయలు, కోడిగుడ్లు, ఇతర వంట సరుకులను పరిశీలించారు. అన్నం సన్నగా ఉంటుందా, దొడ్డుగా ఉంటుందా అని ఆరా తీశారు. ఉప్పు, కూరగాయలు సరిగా లేకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు, ఫుడ్ కమిటీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు అర్ధమవుతున్నాయా.. అని అడిగారు. ఇంగ్లిస్‌లో బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం
బీబీనగర్ : మండలంలోని కొండమడుగు గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే సోమవారం కలెక్టర్ పరిశీలించారు.ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో ఇళ్లు లేని నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. గ్రామసభలు ఏర్పాటు చేసిన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment