గోదాదేవికి తిరునక్షత్ర మంగళహారతి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. 10వ రోజు బుధవారం ఉదయం గోదాదేవిని పట్టువస్త్రాలు, బండారు ఆభరణాలతో అలంకరించి పాశురాలు పఠించారు. అనంతరం అమ్మవారికి మహిళలు తిరునక్షత్ర మంగళ హారతులతో నీరాజనం పలికారు.
నేత్రపర్వంగా సంప్రదాయ పూజలు
ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ముఖ మండపం, ప్రాకార మండపంలో అష్టోత్తరం, సుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు చేపట్టారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవారికి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
నిత్యాదాయం రూ.65,39,905
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వివిధ విభాగాల నుంచి నిత్యాదాయం బుధవారం ఒక్క రోజే రూ.65,39,905 సమకూరినట్లు ఈఓ భాస్కర్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment