రోజంతా ముసురు
భువనగిరి, భువనగిరి టౌన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం ప్రభావంతో బుధవారం జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ముసురు వానతో పాటు చల్లటి గాలులు కూడా వీయడంతో ప్రజానీకం ఇబ్బందులు పడ్డారు. ఇళ్లనుంచి పెద్దగా బయటకు రాలేదు. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైంది.
మండలాల వారీగా వర్షపాతం (మి.మీ)
రాజాపేట మండలంలో 9.8 మి.మీ, చౌటుప్పల్‌లో 9, భువనగిరి 6.8, అడ్డగూడూరు 6.3, వలిగొండ 5.5, భూదాన్‌పోచంపల్లి 5.0, గుండాల 5.0, సంస్థాన్‌నారాయణపురం 4.8, ఆలేరు 3.5, రామన్నపేట 3.5, మోత్కూరు 3.0, తుర్కపల్లి 2.8, మోటకొండూరు 2.5, ఆత్మకూర్ (ఎం) 2.5, బీబీనగర్ మండంలంలో 2.5 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
ఫ చలిగాలులతో ఇబ్బంది పడ్డ ప్రజానీకం
Comments
Please login to add a commentAdd a comment