ఆటోమేటిక్ బెల్
ఆత్మకూరు(ఎం) : మండలంలోని పల్లెర్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటెండర్ లేని కొరతను తీరుస్తోంది.. ఆటోమెటిక్ బెల్. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ కె.శ్రీనివాసరావు సొంత డబ్బులు రూ.6వేలతో అటోమెటిక్ బెల్ ఏర్పాటు చేశారు. డిజిటల్ టైమ్ స్విచ్ క్లాక్‌లో అనుసంధానం చేసి పీరియడ్ టైం సెట్ చేయించా రు. సమయం కాగానే దానంతట అదే బెల్ మోగుతుంది. ఈ తరహా బెల్ జిల్లాలో మరే పాఠశాలలో లేదని హెచ్‌ఎం తెలిపారు. పాఠశాలలో 88 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
డిజిటల్ టైమ్ స్విచ్ క్లాక్
Comments
Please login to add a commentAdd a comment