ఆశపడితే ఆగమే..! | - | Sakshi
Sakshi News home page

ఆశపడితే ఆగమే..!

Published Thu, Jan 23 2025 1:57 AM | Last Updated on Thu, Jan 23 2025 1:57 AM

ఆశపడి

ఆశపడితే ఆగమే..!

యువకుల అరెస్ట్‌
ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను నల్లగొండ వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు.
పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు.. ఏడాదిలో 50కి పైగా కేసులు

నేటినుంచి జాన్‌పహాడ్‌ ఉర్సు

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు గురువారం నుంచి ప్రారంభంకానుంది.

గురువారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2025

- 9లో

- 8లో

అత్యాశకు పోవద్దు

అత్యాశకుపోయి చాలా మంది సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వాట్సాప్‌, ఇన్సాట్రాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా యాప్‌ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు తెలివిగా మోసం చేస్తున్నారు. ఇటీవల ఇన్‌వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌ బాగా పెరిగింది. తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించుకోవచ్చని నమ్మ బలుకుతున్నారు. సైబర్‌ మోసం జరిగిన గంటలోపే 1930కి కాల్‌ చేయాలి. రూ.1.50 లక్ష లోపు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో, ఆపైనుంచి రూ.3 కోట్ల వరకు సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అత్యాశకు పోవద్దు. గుర్తు తెలియని నంబర్లు ఎత్తవద్దు. లింకులు, యాప్‌లను ఓపెన్‌ చేయవద్దు.

–శివశంకర్‌, సైబర్‌ క్రైం ఏసీపీ, రాచకొండ

అవగాహన కల్పిస్తున్నాం

సైబర్‌ మోసాల బారిన పడకుండా రాచకొండ ఐటీ సెల్‌ ఆధ్వర్యంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. పోస్టర్లు, వీడియోలు, రూపొందించి ప్రచారం చేస్తున్నాం. రోజుకు ఒక థీమ్‌ పోస్టర్‌ను రూపొందించి సోషల్‌మీడియా ద్వారా పంపుతున్నాం. రాచకొండ కమిషనరేట్‌లోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రచారం చేస్తున్నాం.

–నరేందర్‌గౌడ్‌, ఏసీపీ, రాచకొండ ఐటీసెల్‌

ఫ బహుమతులు, ఆఫర్లు, ఉద్యోగాల పేరుతో ఆశచూపుతున్న కేటుగాళ్లు

ఫ ఓటీపీలు, లింకులు, యాప్‌లు పంపి

బ్యాంకు ఖాతాలు ఖాళీ

బాధితుల్లో విద్యావంతుల నుంచి

నిరక్ష్యరాస్యుల వరకు..

తాజాగా డిజిటల్‌ అరెస్ట్‌,

ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రాడ్‌, జంపింగ్‌

డిపాజిట్‌ పేరుతో కొత్త పంథా

అప్రమత్తంగా ఉండాలంటున్న

పోలీసు శాఖ

రాచకొండ ఐటీ సెల్‌

ఆధ్వర్యంలో ప్రచారం

ఇలా సైబర్‌ నేరాలు జిల్లాలో నిత్యం చోటు చేసుకుంటున్నాయి. సైబర్‌ నేరగాళ్లు సెల్‌ఫోన్లకు ఓటీపీలు, లింకులు పంపి, బహుమతులు, ఉద్యోగాల ఆశచూపి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అత్యాశకు పోయి కొందరు, అవగాహనలేక మరికొందరు సైబర్‌ నేరగాళ్ల చేతిలో చిక్కి ఆర్థికంగా నష్టపోతున్నారు. బాధితుల్లో విద్యావంతుల నుంచి నిరక్ష్యరాస్యుల వరకు ఉంటున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో గత ఏడాది 2,138 సైబర్‌ కేసులు నమోదు కాగా అందులో భువనగిరి జోన్‌లో 50కి పైగా ఉన్నాయి. ఇందులో రూ.1.50 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు ఆర్థికంగా నష్టపోయిన వారే అధికంగా ఉన్నారు. వెలుగులోకి రాని కేసులు మరెన్నో ఉన్నాయి.

వెలుగు చూసిన

కొన్ని ఘటనలు

● యాదగిరిగుట్ట మండలం గౌరాయల్లికి చెందిన ఓ వ్యక్తి ఫోన్‌కు వాట్సాప్‌ ద్వారా లింకు పంపించారు. లింకు ఓపెన్‌ చేయగానే మీరు డబ్బు సంపాదించుకునేందుకు సువర్ణ అవకాశమని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాందించుకోవచ్చని మెసేజ్‌లో ఉంది. వారి సూచన మేరకు సదరు వ్యక్తి కొంత డబ్బు పంపించగా సైబర్‌ నేరగాళ్లు ఆ మెత్తాన్ని వెంటనే రిటర్న్‌ చేశారు. వారి మాటలు నమ్మి ఆ తర్వాత రూ.80,000 పంపించాడు. తిరిగి తన అకౌంట్‌లోకి నగదు జమ కాకపోవడంతో సైబర్‌ కాల్‌కు ఫోన్‌ చేశాడు. మోసపోయానని గ్రహించి మరుసటి రోజు యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

● యాదగిరిగుట్ట మండలం బాహుపేటకు చెందిన యువకుడి ఫోన్‌ వాట్సాప్‌కు సైబర్‌ నేరగాళ్లు యాప్‌ పంపారు. దాన్ని ఓపెన్‌ చేయగానే అతని ఖాతానుంచి రూ.3,650 డెబిట్‌ అయ్యాయి. బ్యాంకులో సంప్రదించగా గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన ఇర్ఫాన్‌ఖాన్‌ అనే వ్యక్తి ఖాతాలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.

● ఆలేరుకు చెందిన ఓ వ్యక్తికి యూఎస్‌ఏ నుంచి మాట్లాడుతున్నామని సైబర్‌ నేరగాళ్ల నుంచి ఫోన్‌ వచ్చింది. ఒక నేరం విషయంలో మీ అబ్బాయిపై ఇక్కడి స్టేషన్‌లో కేసు నమోదైంది, తప్పించడానికి రూ.57 వేలు చెల్లించాలని చెప్పారు. అబ్బాయి తల్లిదండ్రులు నమ్మి ఫోన్‌ పే చేశారు.

● యాదగిరిగుట్ట మండలం గుండ్లగూడెంకు చెందిన వ్యక్తి ఫోన్‌కు వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. మీకు ఆఫర్‌లో కారు వచ్చిందని, మొదలు రూ.47వేలు పంపాలని చెప్పారు. సదరు వ్యక్తి వారి మాటలు నమ్మి నగదు పంపించాడు.

● డెబిట్‌కార్డు అప్‌డేట్‌ చేసుకోవాలని ఆలేరులోని చింతలబస్తీకి చెందిన యువకుడికి ఫోన్‌ వచ్చింది. అనంతరం ఓటీపీ పంపారు. సదరు వ్యక్తి ఓటీపీ చెప్పగానే అతని ఖాతానుంచి రూ.45వేలు డెబిట్‌ అయ్యాయి.

● ప్రైవేట్‌ జాబ్‌, పార్ట్‌ టైం జాబ్స్‌ ఉన్నాయని, మంచి వేతనం ఇస్తారని ఆలేరులోని చింతలబస్తీకి చెందిన ఓ యువకుడి మొబైల్‌కు వాట్సాప్‌ కాల్‌ చేశారు. వారి మాటలు నమ్మి రూ.98 ఫోన్‌ పే చేశాడు. వారం రోజులైనా సమాచారం రాకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

● జాబ్‌ ఉందని ఆలేరు మండలం కొలనుపాక యువకుడికి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. వారి మా టలు నమ్మి రూ.58వేలు ఫోన్‌ పే చేశాడు.

న్యూస్‌రీల్‌

సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో..

సైబర్‌ మోసగాళ్లు ఇటీవల నూతన పంథా ఎంచుకుని నేరాలకు పాల్పడుతున్నారు. సీబీఐ, ఈడీ, నాల్కోట్రిక్స్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ.. మీఅబ్బాయి నేరం చేశాడు, లేదా మీరే నేరం చేశారు, జైలుశిక్ష పడుతుంది.. కేసునుంచి తప్పించాలంటూ కొంత డబ్బు పంపాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా బ్యాంకు ఖాతా సీజ్‌ చేస్తున్నాం, ఖాతా అబ్జర్వేషన్‌లో ఉంది.. మీ అకౌంట్‌లో డబ్బును ఈ నంబర్‌కు పంపాలంటూ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుంటున్నారు. ఇందుకు సంబంధించి నకిలీ రిసిప్ట్‌ ఇస్తున్నారు.

జంపింగ్‌ డిపాజిట్‌..

ఖాతాదారుడి అకౌంట్‌లో గుర్తు తెలియని నంబర్‌ నుంచి కొంత నగదు జమ అవుతుంది. డబ్బులు పడగానే ఫోన్‌కు వెంటనే మెసేజ్‌ వస్తుంది. అంది చూసి వెంటనే లింకు నొక్కేస్తున్నారు. దీంతో ఖాతాదారుడి ఫోన్‌లో ఉన్న డేటా పూర్తిగా సైబర్‌నేరగాళ్ల పరిధిలోకి వెళ్తుంది. వెంటనే ఖాతాలోని నగదు విడతల వారీగా, లేదా పూర్తిగా డ్రా అవుతుంది. మరికొందరు సైబర్‌ నేరగాళ్లు వాళ్లే కాల్‌ చేసి మన అకౌంట్‌లో డబ్బులు పడ్డాయని లింక్‌ పంపించి రిటర్న్‌ చేయాలని కోరుతున్నారు. ఇలా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.

సాక్షి, యాదాద్రి : హలో.. మీకు కారు ఆఫర్‌ ఉంది.. తక్కువ రేటుకే వస్తుంది.. ముందుగా రూ.47వేలు ఫోన్‌ పే చేయండి.. యాదగిరిగుట్ట మండలం గుండ్లగూడేనికి చెందిన వ్యక్తికి వచ్చిన ఫోన్‌ కాల్‌.

‘‘ మేం యూఎస్‌ఏ నుంచి మాట్లాడుతున్నాం.. ఒక విషయమై మీ అబ్బాయిపై ఇక్కడి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.. కేసు నుంచి తప్పించాలంటే కొంత నగదు చెల్లించాలి.. ఆలేరు పట్టణానికి చెందిన యువకుడి తల్లిదండ్రులకు వచ్చిన ఫోన్‌ కాల్‌.’’

హలో.. మేం హైదరాబాద్‌ నుంచి మాట్లాడుతున్నాం.. ఇక్కడ ఫుల్‌టైం, పార్ట్‌ టైం జాబ్స్‌ ఉన్నాయి.. మంచి సాలరీ వస్తుంది.. మొదలు రూ.98 వేలు డిపాజిట్‌ చేయాలి.. అంటూ ఆలేరు పట్టణంలోని ఓ యువకుడి మొబైల్‌కు వచ్చిన వాట్సాప్‌ కాల్‌..

ఇన్‌వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌..

సైబర్‌ నేరగాళ్లు పేరుమోసిన కంపెనీల పేరుతో షేర్లు విక్రయిస్తారు. గూగుల్‌లోకి వెళ్లి సెర్చ్‌చేయాలని లింక్‌లు పంపిస్తారు. ఫోన్‌లో కాంటాక్టు కాగానే షేర్లు పబ్లిక్‌ ఆపరింగ్‌ అంటూ తక్కువ ధరకు కొనుగోలు చేయాలని కోరుతారు. ఇందుకోసం సెబీ నుంచి అనుమతి ఉందని, అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్‌స్టేట్‌ మెంట్‌లు కూడా చూపిస్తారు. కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్‌ చేయగానే ఖాతాలను క్లోజ్‌ చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆశపడితే ఆగమే..! 1
1/7

ఆశపడితే ఆగమే..!

ఆశపడితే ఆగమే..! 2
2/7

ఆశపడితే ఆగమే..!

ఆశపడితే ఆగమే..! 3
3/7

ఆశపడితే ఆగమే..!

ఆశపడితే ఆగమే..! 4
4/7

ఆశపడితే ఆగమే..!

ఆశపడితే ఆగమే..! 5
5/7

ఆశపడితే ఆగమే..!

ఆశపడితే ఆగమే..! 6
6/7

ఆశపడితే ఆగమే..!

ఆశపడితే ఆగమే..! 7
7/7

ఆశపడితే ఆగమే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement