25న సుస్థిర విజ్ఞాన సదస్సు
చౌటుప్పల్ : పట్టణంలో ఈ నెల 25న గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు నిర్వహించనున్నామని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాంధారి ప్రభాకర్ తెలిపారు. బుధవారం చౌటుప్పల్ పట్టణంలో నిర్వహించిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీటు ఎత్తు కలిగిన 500 గాంధీ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని, 500 మంది బాలలతో గాంధీ వేషధారణ, 100 చరకాలను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఎద్దుగానుగ, మహాత్మాగాంధీ ఫొటో గ్యాలరీ, గాంధీ విజ్ఞానానికి సంబంధించిన ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మండల అధ్యక్షురాలు వెన్‌రెడ్డి సంధ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీబీ కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్‌రెడ్డి, మహిళా కన్వీనర్ యానాల రాధిక, మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఉజ్జిని మంజుల, కోశాధికారి పోలోజు శ్రీలత, ప్రతినిధులు వనం మమత, బొబ్బిళ్ల సంధ్య, భవాని, ఝాన్సీ, స్వప్న, సువర్ణ, పద్మావతి, షామిని, లక్ష్మి, విజయ, కీర్తన, చందన, సంధ్య, నిఖిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment