సాక్షి,యాదాద్రి : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీఓటును మించిన ఆయుధం లేదు.. నేను కచ్చితంగా ఓటు వేస్తాన్ఙు అనే నినాదంతో ఓటర్ల దినోత్సవం నిర్వహించాలన్నారు. ఓటు ప్రాధాన్యతను తెలియజేయాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఓటరు దినోత్సవం సందర్భంగా భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటరు నమోదు, ఇతర సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఐఈఓ రమణి, జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజయనేయులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment