అపోహలు వద్దు.. అర్హులందరికీ పథకాలు
భూదాన్‌పోచంపల్లి : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, జాబితాలో పేర్లు లేని వ్యక్తులు అపోహలకు లోనుకావద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం భూదాన్‌పోచంపల్లిలోని నాలుగో వార్డులో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. జాబితాలో తమ పేర్లు రాలేదని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆందోళన చెందవద్దని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన, సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా స్వీకరించిన దరఖాస్తుల ముసాయిదా జాబితాలోని పేర్లను గ్రామసభల్లో చదివి వినిపిస్తున్నామని తెలిపారు. ఇదే ఫైనల్ కాదని, గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి ప్రాధాన్యతగా జాగ ఉండి ఇల్లులేని వారికి, ఆ తరువాత పూరిగెడిసె, రేకుల ఇళ్లలో ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుదన్నారు.ఉపాధిహామీ పథకంలో 20 రోజులు పని దినాలు కలిగిన భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ.12వేలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, ము న్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరనాయక్, ఇంచార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, కౌన్సిలర్ పెద్దల చక్రపాణి, అర్బన్ బ్యాంకు చైర్మన్ తడక రమేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దానయ్య, కుక్క స్వామి, కుక్క కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అనంతారం గురుకుల పాఠశాల తనిఖీ
భువనగిరి : మండలంలోని అనంతారం పరిధిలో ని పూలే గురుకుల బాలుర పాఠశాలను బుధవారం కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వంట గది, వంటలను పరిశీలించారు. కూరగాయాలు నాణ్యతగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలు, సరుకులు సప్లయ్ చేసే కాంట్ట్రాక్లర్లకు నోటీసులు జారీ చేశారు. నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందజేయాలని సూచించారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment