అనర్హులను ఎంపిక చేశారు
భువనగిరి : మండలంలోని అనంతారంలో బుధవారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి హాజరైన ఈ సభలో అధికారులు రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా చదువుతుండగా బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులను ఎంపిక చేశారని, రాజకీయాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, అర్హులందరికీ పథకాలు అందజేయాలని ఎమ్మెల్యేను ప్రశ్నశించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు ముందుకురావడంతో పోలీసులు జోక్యం చూసుకుని వారిని దూరంగా తీసుకెళ్లారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, ఆందోళన చెందవద్దన్నారు. జాబితాలో పేర్లు లేని వారు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, అధికారులు పాల్గొన్నారు.
కూరెళ్లలో అర్ధాంతరంగా
ముగిసిన గ్రామసభ
ఆత్మకూరు(ఎం): మండలంలోని కూరెళ్లలో నిర్వహించిన గ్రామసభ అర్ధాంతరంగా ముగిసింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం 565 మంది దరఖాస్తు చేసుకోగా 165 మంది పేర్లు, రేషన్ కార్డులకు 264 దరఖాస్తులు రాగా 25 మంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 54 మంది ఎంపికైనట్లు జాబితాలో పేర్లు వచ్చాయి. అధికారులు జాబితా చదువుతుండగా పేర్లు రానివారు వాగ్వాదానికి దిగారు. సాగు భూములు, ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు వచ్చాయంటూ అధికారులను నిలదీశారు. రెండు గంటల పాటు సభ జరగనీయకపోవడంతో పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినిపించుకోకపోవడంతో అధికారులు గ్రామసభను ఆర్ధాంతరంగా ముగించి వెళ్లారు.
ఫ అనంతారం గ్రామసభలో గందరగోళం
ఫ ఎమ్మెల్యేను అడ్డుకున్న బీఆర్‌ఎస్ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment