![పెద్ద](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09spt251-230022_mr-1739132421-0.jpg.webp?itok=40SVVZJe)
పెద్దగట్టుపై పట్టింపేది?
చివ్వెంల(సూర్యాపేట): దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు (శ్రీ లింగమంతుల స్వామి) జాతర ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరగనుంది. ఐదు రోజుల పాటు జరుగనున్న ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంనేందుకు వస్తారు. సుమారు 30 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే ఈ జాతరకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉంది. పనులు మాత్రం నత్తనడకన సాగుతుండడంతో జాతర నాటికి పనులు పూర్తవుతాయో లేదోనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి జాతరలో తాత్కాలిక పనులే..
పెద్దగట్టు జాతరకు ప్రతిసారి తాత్కాలిక పనులు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈసారైనా తాత్కాలిక పనులు కాకుండా శాశ్వతంగా చేపట్టాలని కోరుతున్నారు. భక్తుల సౌకర్యార్థం జాతరకు వచ్చే రహదారుల విస్తరణ, వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాటు, తాగునీటి వసతులు, వైద్య సదుపాయాలు, రహదారుల మరమ్మతులు, అవాంచనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని భక్తులు వేడుకుంటున్నారు. జాతర జరిగే సమయంలో మాత్రమే అధికారులు హడావుడి చేసి, తర్వాత ఆలయం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని భక్తులు వాపోతున్నారు.
రూ.5 కోట్లు మంజూరు
రాష్ట్ర ప్రభుత్వం జాతరకు రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేసింది. జాతరకు వారం రోజులు మాత్రమే ఉండటంతో, గతంలో మాదిరిగా మళ్లీ తాత్కాలిక పనులే చేపడుతారా అని భక్తులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజుల్లో లింగమంతుల స్వామి జాతర ప్రారంభం
భక్తుల సౌకర్యాల కల్పనకు
రూ.5 కోట్లు మంజూరు
శాశ్వత పనులు కాకుండా
తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపుకుంటున్న అధికారులు
నిరుపయోగంగా కుళాయిలు, మరుగుదొడ్లు
ఇప్పటివరకు మిషన్ భగీరథ ట్యాంకులకు నీటి కుళాయిలు ఏర్పాటు చేయలేదు. గతంలో తాత్కాలిక ప్రాతిపాదికన ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్లు.. నిర్వహణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. గుట్టపై తాగునీటి ట్యాంకు ఉన్నప్పటికీ అక్కడక్కడా ఏర్పాటు చేసిన కళాయిలకు పూర్తిస్థాయిలో నీరు అందించలేని పరిస్థితి. మహిళలు స్నానాలు చేసి దుస్తులు మార్చుకునేందుకు సరైన గదులు లేవు.
ఇబ్బందులు కలగకుండా వసతులు
ఈ నెల 16 నుంచి 20 వరకు జాతర జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తాం. జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. చలువ పెందిళ్లు వేస్తున్నాం. తాగునీటి సదుపాయం కల్పిస్తున్నాం.
–పోలేబోయిన నర్సయ్య యాదవ్,
పెద్దగట్టు ఆలయ కమిటీ చైర్మన్
![పెద్దగట్టుపై పట్టింపేది?1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09spt254-230022_mr-1739132421-1.jpg)
పెద్దగట్టుపై పట్టింపేది?
Comments
Please login to add a commentAdd a comment