చౌటుప్పల్ రూరల్ : చౌటుప్పల్ ప్రాంతానికి సాగునీరు సాధించడమే లక్ష్యమని తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ కట్టా భగవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన చౌటుప్పల్ మండలంలోని ఎల్లగిరి, ఖైతాపురం, ఎల్లంబావి, ఎల్లగిరి, కొయ్యలగూడెం, దండుమల్కాపురం, తుప్రాన్‌పేట గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ చౌటుప్పల్ ప్రాంతంలో సాగునీటి వనరులు లేక రైతులు, ప్రజలు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారని పర్కొన్నారు. సాగునీరు అందించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని, అయినా పట్టించుకునే వారు లేరన్నారు. సాగునీటి కోసం రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఇందుకోసం త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. సమావేశంలో మెట్టు సుదర్శన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రిక్కల ఇందిరాసత్తిరెడ్డి, గుర్రం కొండయ్య, యాదయ్య, నాయకులు కంది లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment