![చేజికి్కంచుకునేలా!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/congressvote_mr-1739217765-0.jpg.webp?itok=3Ta7OBOe)
చేజికి్కంచుకునేలా!
స్థానిక సంస్థల్లో పట్టుకు కాంగ్రెస్ వ్యూహం
ఆశావహులు ఫుల్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇతర పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరిలో పలువురు మున్సిపల్ చైర్మన్ పదవులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ఆశిస్తున్నారు. కాగా పదేళ్లు అధికారంలో లేకున్నా పార్టీని వెన్నంటి ఉన్న కేడర్‌లో చాలామంది బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగనుండడంతో టికెట్ సాధిస్తే గెలుపు నల్లేరుపై నడకేనన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. రిజర్వేషన్లు ఖరారు కానప్పటికీ తమ వర్గానికి వస్తుందన్న అంచనాతో టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఇళ్ల వద్దకు ఆశావహుల తాకిడి మొదలైంది. ఎమ్మెల్యేలు మాత్రం పాత, కొత్త వారిని సమన్వయం చేసుకుని గెలుపుగుర్రాలకు టికెట్‌లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రంగం సిద్ధమైంది.
సాక్షి, యాదాద్రి : స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. మెజార్టీ స్థానాలను కై వసం చేసుకుని స్థానిక సంస్థల్లోనూ పట్టు పెంచుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. త్వరలో ప్రాదేశిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో కేడర్‌ను సన్నద్ధం చేయడంతో పాటు అభ్యర్థుల గెలుపు బాధ్యతలను రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్యేలపై మోపింది. అనుసరించాల్సిన వ్యూహంపై ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలో వారికి దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు క్షేత్ర పర్యటనలు, స న్నాహక సమావేశాలకు సమాయత్తం అవుతున్నారు.
పనితీరు ప్రామాణికంగా..
జిల్లాలోని 178 ఎంపీటీసీలు, 17 జెడ్పీటీసీ స్థానా లు, 428 గ్రామ పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వరుస విజయాలతో ఊపుమీదున్న కాంగ్రెస్.. స్థానిక పోరులోనూ అదే జోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. అందుకోసం కీలకమైన అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో ఉంది. పెద్దల అండ ఉంటే చాలూ.. టికెట్ వస్తుందన్న అభిప్రాయానికి ఈసారి పార్టీ నాయకత్వం చెక్ పెట్టనుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కేడర్ పనితీరు ప్రామాణికంగా, కొత్తగా పార్టీలో చేరిన వారిని సమన్వం చేసుకుంటూ అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఫ 90 శాతం సీట్లు సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ
ఫ అభ్యర్థుల గెలుపు బాధ్యతలు ఎమ్మెల్యేలకు
ఫ క్షేత్ర పర్యటనలు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలకు సమాయత్తం
అందరి చూపు రిజర్వేషన్ల వేపై..
ప్రస్తుతం అందరి చూపు బీసీ రిజర్వేషన్లపైనే ఉంది. ప్రభుత్వానికి డెడికేటెడ్ బీసీ కమిషన్ నివేదికను సమర్పించింది. దీని ప్రకారం మండలం యూనిట్‌గా ఎంపీటీసీలు, జిల్లా యూనిట్‌గా జెడ్పీటీసీ రిజర్వేషన్లు, రాష్ట్రం యూనిట్‌గా జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలో ఆశావహులు ఇప్పటికే టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. వారంతా రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment