![స్నేహానికన్న మిన్న లోకాన లేదు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10alr501-230117_mr-1739217767-0.jpg.webp?itok=qBzhTIJg)
స్నేహానికన్న మిన్న లోకాన లేదు
ఆలేరు రూరల్ : స్నేహానికన్న మిన్న లోకాన లేదని, నిజమైన స్నేహితులు ఉన్న వ్యక్తి అదృష్టవంతుడని సినీగేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ అన్నారు. కాళోజీ అవార్డు గ్రహీత, ప్రముఖ చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ రచించిన దోస్తానా మినీ కవితా సంపుటిని సోమవారం ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి వ్యక్తి తన దోస్తులతో అమృత తుల్యమైన ఆనందనం పంచుకుంటారని పేర్కొన్నారు. హరగోపాల్ తన స్నేహితులతో ఉన్న ఐదు దశాబ్దాల అనుబంధాన్ని దోస్తాన సంపుటి ద్వారా అక్షరబద్ధం చేశారని పేర్కొన్నారు. సంపుటిలోని 150 కవితలు స్నేహం విలువలను చాటిచెబుతున్నాయన్నారు. హరగోపాల్ పరిశోధనల్లో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారని కొనియాడారు. అదే విధంగా పుస్తక ప్రచురణ కర్త అమ్మయాది పెండెం ఫౌండేషన్ అధ్యక్షుడు పెం సత్యనారాయణ, కవి శ్రీరామోజు హరగోపాల్, డాక్టర్ తిరునగరి శ్రీనివాస్, డాక్టర్ పోరెడ్డి రంగయ్య, పాఠశాల హెచ్‌ఎం దాసరి మంజుల, మేఘరాజు మాట్లాడారు. కార్యక్రమంలో నంది అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్టు ఎండీ అబ్దుల్, యంబ నర్సింహులు, బండిరాజుల శంకర్, ఆకవరం మోహన్‌రావు, జి.కుమారస్వామి, వంగపల్లి అంజయ్యస్వామి, దూడల వెంకటేశ్, బొమ్మకంటి బాలరాజు, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ సభ్యులు సుధాకర్, సుభాష్, జయంత్, గఫార్, సాహితీ అభిమానులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి హరగోపాల్, సుద్దాల అశోక్ తేజను పలువురు ఘనంగా సన్మానించారు.
ఫ ‘దోస్తానా’ పుస్తకావిష్కరణలో సుద్దాల అశోక్‌తేజ
Comments
Please login to add a commentAdd a comment