![‘ప్రాదేశిక’ ఓటర్ల జాబితా ప్రదర్శన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10bng04-604900_mr-1739217767-0.jpg.webp?itok=RElIc3J-)
‘ప్రాదేశిక’ ఓటర్ల జాబితా ప్రదర్శన
సాక్షి,యాదాద్రి : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తికాగా ఎన్నికల సంఘం గుర్తులను కూడా ప్రకటించింది. సోమవారం జిల్లా వ్యాప్తంగా 17 మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటరు జాబితాలను ప్రదర్శించారు. జిల్లాలో మొత్తం 178 ఎంపీటీసీ స్థానాలు, 17 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటించి బుధవారం నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
15లోగా ఏర్పాట్లు పూర్తి చేయండి
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈనెల 15లోగా ఏర్పాట్లు పూర్తి కావాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌తో అదనపు కలెక్టర్ గంగాధర్‌తో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. మంగళవారం (నేడు) పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల చేసి 12నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించాలని, 15న తుది జాబితా ప్రదర్శించాలని సూచించారు. 13నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు పీఓలు, ఏపీఓలతో పాటు ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. అధికారులు నేరుగా వెళ్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించి అనువుగా ఉన్నాయా లేదా పరిశీలించాలని ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సజావుగా నిర్వహించేలా సిద్ధంగా ఉండాలని కోరారు. ఏర్పాట్లలో ఏచిన్న లోపం రావద్దని, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు వస్తే జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో చౌటుప్పల్ ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీపీఓ సునంద, జిల్లా పరిష్‌త్ సీఈఓ శోభారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఫ నేడు పోలింగ్ కేంద్రాల ముసాయిదా వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment