నైపుణ్య శిక్షణతో ఉద్యోగం | - | Sakshi
Sakshi News home page

నైపుణ్య శిక్షణతో ఉద్యోగం

Published Sat, Jul 15 2023 12:50 AM | Last Updated on Sat, Jul 15 2023 12:50 AM

- - Sakshi

నేను ఇంటర్మీడియేట్‌ చదువు కున్నాను. చాలా ఇంటర్వ్యూలకు వెళ్లినా ఉద్యోగం రాలేదు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా శిక్షణ తీసుకుంటున్నా. ఒక ప్రముఖ కంపెనీకి ఎంపికై ఉద్యోగం చేస్తున్నాను. సరైన శిక్షణ లేక చాలామంది ఇంటర్వ్యూలను ఎదుర్కొలేక పోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నాను. – ఎస్‌.రాజి, ఇంటర్మీడియేట్‌, తాడిపత్రి

కుటుంబానికి ఆసరాగా..

నేను బీటెక్‌ చదివాను. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీడీయూజీకేవైలో శిక్షణ తీసుకున్నాను. నైపుణ్యాలపై మాస్టర్స్‌ ట్రైనర్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం ఓ కంపెనీలో ఉద్యోగం సాధించి మంచి జీతంతో నా కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాను.

– ఆర్‌.నాగవేణి, బీటెక్‌,

నందికొట్కూరు, కర్నూలు జిల్లా

కమ్యూనికేషన్‌లో పట్టు సాధించా

ఇంటర్‌ వరకు చదివి చిన్నచిన్న పనులు చేసుకుంటున్నాను. నిహార్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలిసి ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాను. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, కమ్యూనికేషన్‌లో పట్టు సాధించాను. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు.

– బి.హరిత, ఇంటర్మీడియేట్‌,

సుండుపల్లె, అన్నమయ్య జిల్లా

వృత్తి నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి

నిరుద్యోగ యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలను అమలుచేస్తున్నాం. నైపుణాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పూర్తవగానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.

– డి.నాగార్జున, జిల్లా నైపుణాభివృద్ది అధికారి, కడప

No comments yet. Be the first to comment!
Add a comment
1/3

2/3

3/3

Advertisement
 
Advertisement
 
Advertisement