పెద్దతిప్పసముద్రం : మండలంలోని రాపూరివాండ్లపల్లి పంచాయతీ కాయలవాండ్లపల్లికి చెందిన పలువురు అడవి పందులకు ఉరేసి చంపి వాటి మాంసం విక్రయిస్తున్నారని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. సమీప అటవీ ప్రాంతంలో పర్యవేక్షించే వన సంరక్షణ సమితి (వీఎస్‌ఎస్) గార్డు వెంకటశివ మూగ జీవాలను ఎవరు చంపి మాంసం విక్రయిస్తున్నారో వారి వివరాలను సమగ్రంగా తెలుసుకుని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. ఈ నేపథ్యంలో శనివారం అటవీ శాఖ సెక్షన్ అధికారి ముబీన్‌తాజ్, సిబ్బంది గోపాల్, ప్రకాష్‌లు గ్రామానికి చేరుకున్నా రు. అనంతరం అధికారులు మాంసం విక్రయదారులతో చర్చించి రూ.5 లక్షలు డి మాండ్ చేసి చివరకు రూ.లక్ష ఇస్తే కేసు లే కుండా చేస్తామని బహిరంగంగా చెప్పినట్లు గ్రామస్థులు తీసిన వీడియో రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. అనంతరం అటవీ అధికారులు మాంసం విక్రయించే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ విషయంపై సెక్షన్ అధికారి ముబీన్‌తాజ్‌ను వివరణ కోరగా తమకు వచ్చిన సమాచారం మేరకు గ్రామానికి వెళ్లామన్నారు. మూగ జీవాలను చంపినందుకు 1974 యాక్ట్ ప్రకారం గతంలో రూ.25 వేలు అపరాధ రుసుం ఉండేదని, ప్రస్తుతం 2020–2022 అటవీ యాక్ట్ ప్రకారం రూ.లక్ష నుంచి రూ.5 లక్షల జరిమానాతో పాటు కేసు కూడా నమోదు అవుతుందన్నారు. అది కూడా డీఎఫ్‌వో పర్యవేక్షణలోనే విచారణ జరుగుతుందన్నారు. అయితే తాను ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదని, డబ్బు ఇచ్చినా ఆ అపరాధ సొమ్ము ప్రభుత్వ ఖజానాకు జమ చేసిన అనంతరం ఆన్‌లైన్ రశీదును మాంసం విక్రయదారులకే ఇస్తామని ఆమె వెళ్లడించారు.
రూ.5 లక్షలు చెల్లించాలన్న ఫారెస్ట్ అధికారులు
సామాజిక మాధ్యమాల్లో వీడియో హల్‌చల్
Comments
Please login to add a commentAdd a comment