నేడు సర్వసభ్య సమావేశం
కడప ఎడ్యుకేషన్: ది కడప ఎలిమెంటరీ, సెకండరీ స్కూల్ టీచర్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 24న ఉదయం 9 గంటలకు కడప నగర సమీపంలోని పబ్బాపురం ఆఫీస్‌లో జరగనుంది. ఈ విషయాన్ని అధ్యక్ష, కార్యదర్సులు విశ్వనాథరెడ్డి, బాల శౌరిరెడ్డి శనివారం తెలిపారు. జిల్లాలోని సొసైటీ సభ్యులందరూ సమామావేశానికి హాజరుకావాలని కోరారు.
నేటి నుంచి అండర్–23
వన్డే క్రికెట్ మ్యాచ్‌లు
కడప స్పోర్ట్స్: కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానం, కేఎస్‌ఆర్‌ఎం, కేఓఆర్‌ఎం మైదానంలలో ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు ఏసీఏ అండర్–23 వన్డే పురుషుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో అనంతపురం, ప్రకాశం, తూర్పుగోదావరి, రెస్టాఫ్ సౌత్, రెస్టాఫ్ సెంట్రల్, రెస్టాఫ్ నార్త్ జట్లు తలపడనున్నాయి
రేపు వ్యాసరచన పోటీలు
కడప ఎడ్యుకేషన్: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని 25వ తేదీ ఉదయం 10 గంటలకు కడపలోని సీఎస్‌ఐ స్కూల్ ఆవరణలో ఉన్న డీసీఈబీలో విద్యార్థులకు కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. ఇందులో భాగంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, దేశభక్తి గీతాలాపన, క్విజ్ తదితర అంశాలపై పోటీలు ఉంటాయన్నారు. మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు ప్రతి మండలం నుంచి ప్రతి అంశానికి సంబంధించి ఒక విద్యార్థిని పోటీలకు పంపాలని డీఈఓ సూచించారు.
విరాళం అందజేత
బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిద మాంబల నిత్య కల్యాణం కోసం శనివారం హైదరాబాదులోని దూల్‌పల్లెకు చెందిన భక్తులు మాణిక్యరాము,సరిత దంపతులు రూ 1,00116 నగదు ఇచ్చారు. దేవస్థానం మేనేజర్ ఈశ్వరాచారి తరపున సిబ్బంది నగదుకు సంబందించి రశీదు భక్తులకు అందించారు. పిట్‌పర్సన్ శంకర్‌బాలాజీ మాట్లాడుతూ బి.మఠం అభివృద్ధికి భక్తుల సహకారం ఉండాలన్నారు.
26న జీవశాస్త్ర
ఉపాధ్యాయులకు శిక్షణ
కడప ఎడ్యుకేషన్: ఆధునిక కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో శాసీ్త్రయ జిజ్ఞాసను పెంపొందించడానికి జీవశాస్త్ర ఉపాధ్యాయులకు 26వ తేదీ హ్యాండ్స్ అన్ ఎక్స్‌పరిమెంట్స్‌పై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. కడపలోని పురుషుల కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కడప, అట్లూరు, బద్వేల్, సీకేదిన్నె, చెన్నూరు. గోపవరం, కమలాపురం, ఖాజీపేట, సిద్దవటం, వల్లూరు, ఒంటిమిట్ట మండలాల్లోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో పనిచేస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయులు హాజరు కావాలని,నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని డీఈఓ మీనాక్షి సూచించారు.
ఆర్ట్ క్యాంపు మెంటార్‌గా కోట మృత్యుంజయ రావు
వైవీయూ: ముంబైలోని కోకుయో క్యామ్లిన్ ఆర్ట్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న దక్షిణ భారతదేశ పెయింటింగ్ క్యాంపునకు రెండు తెలుగు రాష్ట్రాల తరఫున మెంటార్‌గా వైవీయూ లలిత కళా విభాగాధిపతి డాక్టర్ మృత్యుంజయరావు ఎంపికయ్యారు.ఈ మేరకు కామ్లిన్ ఫౌండేషన్ నుంచి ఆయనకు ఉత్తర్వులు అందాయి. ఈ నెల 25 నుంచి 30 తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం హంపిలో ఉన్న హంపి యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ క్యాంపు నిర్వహించనున్నారు. దక్షిణ భారత దేశంలోని అన్ని ఫైన్ ఆర్ట్స్ కాలేజీల నుండి ఎంపిక చేయబడిన దాదాపు 80 మంది యువ చిత్రకారులు పాల్గొంటున్నారు. కాగా వైవీయూ లలిత కళా విభాగంకు చెందిన బీఎఫ్‌ఏ 4వ సంవత్సరం విద్యార్థి డి. ముత్యం ఈ వర్క్‌షాప్‌నకు ఎంపికయ్యాడు. 80 మంది చిత్రించిన చిత్రాలను ముంబై జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన చేస్తారు. అమ్ముడుపోయిన చిత్రాల నగదును ఆయా యువ చిత్రకారులకు క్యామ్లిన్ ఫౌండేషన్ వారు అందజేస్తారు. డాక్టర్ మృత్యుంజయరావుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment