వైవీయూ: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి)లో ఈనెల 25వ తేదీన ‘సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం అధునాతన మెటీరియల్స్ సంశ్లేషణ’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి.రవీంద్రనాథ్, సదస్సు కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఆచా ర్యులు హాజరవుతున్నట్లు తెలిపారు. అధునాతన పరిశోధనల సామర్థ్యాలను పెంపొందించడానికి పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమల నిపుణుల మధ్య విజ్ఞాన భాగస్వామ్యం, సహకారం, నెట్‌వర్కింగ్ కోసం చక్కటి వేదికగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హార్సిలీహిల్స్‌పై
కాటేజీల నిర్మాణం
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలో అటవీశాఖకు రెవెన్యూ శాఖ కేటాయించిన 40వేల ఎకరాల్లో అడవుల పెంపకం చేపడుతున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి జగన్నాథ్ సింగ్ వెల్లడించారు. శనివారం బి.కొత్తకోట మండలం హార్సిలీ హిల్స్ పై అటవీ ప్రాంగణంలో ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం జిల్లాలో 38 బ్లాక్లుల పరిధిలో రెవెన్యూ భూమి అటవీశాఖకు కేటాయించారన్నారు. ఇందులో కొందరికి డీకేటి పట్టాలు ఇచ్చినట్టు తెలిసిందన్నారు. ఈ పట్టాలను రద్దు చేయించి ఆక్రమణల తొలగింపుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ భూమిలో మొక్కల పెంపకం చేపట్టి అడవిగా పూర్తిస్థాయిలో అభివద్ధి చేస్తామన్నారు. హార్సిలీ హిల్స్ పై రూ.30 లక్షలతో కొత్తగా 5 కాలేజీల నిర్మాణం, పర్యాటకుల కోసం ట్రెక్కింగ్ పాత్, గార్డెన్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్య కొండపై భక్తుల కోసం రూ.50 లక్షలతో కాలేజీల నిర్మాణం చేస్తున్నామన్నారు. కర్ణాటక–ఆంధ్ర సరిహద్దుల్లో మూతపడిన చెక్ పోస్టులను తిరిగి తెరిపించేందుకు కషి చేస్తామన్నారు. ఆయన వెంట సెక్షన్ ఆఫీసర్ అడపా శివకుమార్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment