డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్
పీలేరు రూరల్ : డిశెంబర్14వ తేదీన నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని చిత్తూరు జిల్లా న్యాయసేవా అధికారసంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్‌జడ్జి యంవిఎన్ పద్మజ అన్నారు. శనివారం స్థానిక కోర్టులో న్యాయవాదులు, పోలీసులతో జాతీయ లోక్‌అదాలత్‌పై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ కక్షిదారులు ఇరువర్గాలను ఒప్పించి రాజీకి ప్రయత్నం చేయాలని సూచించారు. అనంతరం స్థానిక సబ్‌జైల్‌ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె.రవి, జూనియర్ సివిల్‌జడ్జి ఎన్.గాయిత్రి, ఏపీపీ శారద, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీసీ పురుషోత్తంరెడ్డి, న్యాయవాదులు సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖర్, మధుసూదన్‌రెడ్డి, యల్లయ్య, సీఐ యుగంధర్, ఎస్‌ఐ తదితరులు పాల్గొన్నారు.
మెనూప్రకారం భోజనం అందించాలి :
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా న్యాయసేవ అధికారి సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్‌జడ్జి పద్మజ సూచించారు. శనివారం రాష్ట్ర హైకోర్టు ఆదేశాలమేరకు పట్ణంలోని చిత్తూరు రోడ్డులోని అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. అలాగే తిరుపతి రోడ్డులోని ఏపీ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసి అక్కడ ఉన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం పరిశీలించారు. ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కరుణ, లోకేశ్వరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment