గొప్ప విద్యాప్రదాత వీరారెడ్డి
బద్వేలు అర్బన్ : తాను చదువుకోకపోయినా విద్య విలువ తెలుసుకుని ఎన్నో విద్యాసంస్థలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు అండగా నిలిచిన గొప్ప విద్యా ప్రదాత బిజివేముల వీరారెడ్డి అని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. బిజివేముల వీరారెడ్డి 24వ వర్ధంతి సందర్భంగా బుధవారం మైదుకూరురోడ్డులోని వీరారెడ్డి ఘాట్‌లో, నాలుగు రోడ్ల కూడలిలోని వీరారెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక తిరుగులేని నాయకుడిగా వీరారెడ్డి ఎదిగారని అన్నారు. ఎస్‌బీవీఆర్ విద్యాసంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కె.విజయమ్మ, ఎస్‌బీవీఆర్ విద్యాసంస్థల సెక్రటరీ టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్‌రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ప్రత్యేకతను చాటిన రాజకీయ దురంధరుడు, విద్యా ప్రదాత దివంగత బిజివేముల వీరారెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని అన్నారు. అలాగే పేదలకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో ప్రముఖ కంటివైద్యులు డాక్టర్ కె.రవికుమార్‌రెడ్డి, విజయమ్మ కోడలు లీలాకై వల్యరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులరెడ్డి, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నాయకులు, ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment