బి.కొత్తకోట : తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న ఎద్దులను బి.కొత్తకోట పోలీసులు పట్టుకుని చిత్తూరు జిల్లాకు చెందిన ఏడుగురిపై కేసు నమోదు చేశారు. సీఐ జీవన్ గంగనాఽథ్బాబు కథనం మేరకు వివరాలు.. అనంతపురం జిల్లా నుంచి బి.కొత్తకోట మండలం మీదుగా రెండు లారీల్లో ఎద్దులను తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నారని బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన కె.రవీంద్ర బయ్యప్పగారిపల్లె వీఆర్ఓ రవికుమార్‌కు సమాచారం ఇచ్చాడు. తహసీల్దార్ సూచనతో వీఆర్ఓ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. జాతీయరహదారిపై పెద్దపల్లి క్రాస్ వద్ద పోలీసులు రెండు లారీలను ఆపి తనిఖీ చేశారు. లారీల్లో 66 ఎద్దులు ఉన్నట్టు గుర్తించారు. వీటిని తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలంలోని పలు సంతల్లో కొనుగోలు చేసి తమిళనాడులోని సేలంలో జంతువధశాలకు తరలిస్తున్నట్టు నిర్ధారించారు. అనుమతి, లైసెన్సు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించడంతో వీఆర్ఓ రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ఎస్.మహ్మద్ ఆరీఫ్, పెద్దపంజాణీ మండలం రాయలపేటకు చెందిన షేక్ అబ్దుల్ మునాఫ్, జి.సుబ్రమణ్యం, ఎస్.ముబారక్, కె.కృష్ణప్ప, కె.మాబుబాషా, పలమనేరు పట్టణానికి చెందిన ఎస్.అక్బర్‌లపై కేసు నమోదు చేశారు. వీరిలో ఎస్.మహ్మద్ ఆరీఫ్ పరారీలో ఉన్నట్టు సీఐ తెలిపారు. ఎద్దులను తంబళ్లపల్లెలోని నవశక్తి గోశాలకు తరలించారు.
పట్టుకున్న బి.కొత్తకోట పోలీసులు
66 ఎద్దులు గోశాలకు తరలింపు
Comments
Please login to add a commentAdd a comment