●నేడు వైఎస్సార్‌సీపీ పోరుబాట
ప్రజలపై భారం మోపుతోన్న చంద్ర బాబు సర్కార్ చర్యలను నిరసిస్తూ జిల్లా కేంద్రమైన కడపలో నేడు వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైంది. జిల్లా కేంద్రమైన కడపలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, నగర మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వద్దగల విద్యుత్ భవన్ వద్దకు ర్యాలీగా వెళ్లి ఆందోళన చేపట్టనున్నారు. కమలాపురంలో ఇన్‌చార్జ్ నరేన్‌రామాంజులరెడ్డి, బద్వేలులో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నేతృత్వంలో ఆందోళన నిర్వహించనున్నారు. మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ పోరు కొనసాగనుంది. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డిల ఆధ్వర్యంలో విద్యుత్ పోరు కొనసాగనుంది. పులివెందులలో పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ పోరు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పోస్టర్ల ఆవిష్కరణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment