బాదుడే...బాదుడు! | - | Sakshi
Sakshi News home page

బాదుడే...బాదుడు!

Published Fri, Dec 27 2024 2:32 AM | Last Updated on Fri, Dec 27 2024 2:32 AM

బాదుడ

బాదుడే...బాదుడు!

సాక్షి ప్రతినిధి, కడప: అసలే చలికాలం.. ఫ్యాను ఎక్కువగా తిరగాల్సిన అవసరం రాదు.. ఇక లైట్లు.. టీవీ.. రిఫ్రిజిరేటర్‌ మామూలే... అన్నీ గతంలో ఉన్న విద్యుత్‌ ఉపకరణాలే.. ప్రతి నెలా మాదిరే ఈ నెల కూడా 180 యూనిట్లకు ఒకట్రెండు అటోఇటో విని యోగించారు.. అయినా బిల్లేమో వెయ్యికి పైగానే వచ్చింది. ఎందుకో ఆరా తీస్తే .. బిల్లును తరచి చూస్తే ఇదంతా కూటమి సర్కారు ‘సర్దు’పోటు బాదుడని తేలింది. విద్యుత్‌ చార్జీలపై లేనిపోని సర్దుబాటు చార్జీలు పెంచుతూ ప్రజలకు షాకిస్తోంది.

● జిల్లా వాసులపై కూటమి ప్రభుత్వం రెండోసారి భారీ విద్యుత్‌ చార్జీల భారం మోపింది. జిల్లాలో మొత్తం 8,89,907 విద్యుత్‌ కనెక్షన్లు ఉనన్నాయి. ప్రతినెలా రూ.15కోట్లు ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రభుత్వం వసూలు చేయడం ప్రారంభించింది. యూనిట్‌కు 61పైసలు చొప్పున అదనపు భారం మోపింది. 2022లో ఏప్రిల్‌ నెలలో వాడిన విద్యుత్‌ యూనిట్లకు సంబంధించి సర్దుబాటు చార్జీలు (ఎఫ్‌పీపీసీఏ) పేరుతో ఈనెల నుంచి వసూలు చేయనుంది. ఒక్కో యూనిట్‌కు రూ.1.21 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. ఇది ఎక్కువ మొత్తం అవుతుందని, బిల్లు భారీగా పెరగడంతోపాటు ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో దొడ్డిదారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎఫ్‌పీపీసీఏ చార్జీలను రూ.1.21లు ఒకేసారి కాకుండా ఈనెల 61 పైసలు, మరో నెల 60పైసలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. దీంతో ఈనెల బిల్లులో 2022 ఏప్రిల్‌ నెలలో వాడిన విద్యుత్‌ యూనిట్లకు సంబంధించి యూనిట్‌కు 61పైసలు చొప్పున డిసెంబర్‌ బిల్లులో వినియోగదారులకు వడ్డించారు. ఇలా జిల్లా పరిధిలో ఈ నెల అదనంగా రూ.15.10కోట్లకు పైగా వసూలు చేస్తున్నారు. ఈ తర్వాత నెల 60పైసలు చొప్పున రూ.10కోట్లకుపైగా వసూలు చేయనున్నారు. మొత్తంగా జిల్లా ప్రజలపై రూ. 22.26కోట్ల భారం ప్రభుత్వం మోపింది. 2024 అక్టోబర్‌ నెల నుంచి వస్తున్న సర్దుబాటు చార్జీలకు ఇవి అదనం.

ప్రతినెలా విద్యుత్‌ ఘాతం...

ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ అడ్జస్ట్‌మెంట్‌ (ఎఫ్‌పీపీసీఏ) కింద ఇప్పటికే జిల్లా ప్రజలపై కూటమి ప్రభుత్వం కోట్లలో భారం మోపింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన సర్దుబాటు పేరుతో ప్రతినెలా వడ్డనకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2022 ఏప్రిల్‌ నెల సర్దుబాటు చార్జీలకు తోడుగా అక్టోబర్‌ నెల నుంచి ఏ నెలకు ఆనెల సర్దుబాటు పేరుతో యూనిట్‌కు 91 పైసలు చొప్పున భారం వేస్తున్నారు. ఇలా ప్రతినెలా సుమారు రూ.10 కోట్లను వసూలు చేయనున్నట్లు విద్యుత్‌ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇలా గత రెండు నెలల్లో జిల్లా వాసులపై రూ.22.26కోట్ల భారం వేశారు. నవంబర్‌ ట్రూఅప్‌ చార్జీలు రూ.2.37కోట్లు, ఎఫ్‌పీపీసీఏ చార్జీలు రూ.4.79కోట్లు, డిసెంబర్‌ మాసంలో ట్రూఅప్‌ చార్జీలు రూ.2.34కోట్లు, ఎఫ్‌పీపీసీఏ చార్జీలు రూ.15.10కోట్లు వడ్డించారు.

వడ్డింపు ఇలా....

కడప నగరం మారుతీనగర్‌కు చెందిన సి. శ్రీనాథ్‌ గత నవంబర్‌ నెలలో ఫ్యామిలీతో కలిసి వేరే ఊరు వెళ్లారు. నెలంతా లైట్లు, ఫ్యాన్లు ఏమీ వేయలేదు. దీంతో కేవలం 2 యూనిట్ల విద్యుత్‌ వాడకం జరిగింది. అయతే బిల్లు మాత్రం రూ.454 వచ్చింది. ఇందులో ఎనర్జీ చార్జెస్‌ రూ.3.80లు అయితే ఫిక్స్‌డ్‌ చార్జీలు రూ.60, కస్టమర్‌ చార్జీలు రూ.25, ఎఫ్‌పీపీసీఏ 2022–04 చార్జీలు రూ.364లు కలిపి రూ.454లు వేశారు. ఇందులో వాడిన యూనిట్లకు రూ.3.80 పోగా మిగిలిన చార్జీలన్నీ రూ.450.2లు ప్రభుత్వం అదనంగా మోపిన భారంగా చెప్పవచ్చు.

ప్రజలకు ‘షాక్‌’ ఇస్తోన్న కూటమి సర్కారు

ఈ నెల బిల్లు నుంచి రూ.15.1కోట్లు వసూలు

రెండు నెలల్లోనే చంద్రబాబు సర్కార్‌ జిల్లా వాసులపై వేసిన భారం రూ.22.26కోట్లు

ఎన్నికల ముందు విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు హామీ

హామీకి విరుద్ధంగా ప్రజలపై భారీగా విద్యుత్‌ చార్జీల భారం

ప్రజాపక్షమై పోరుబాట పట్టినవైఎస్సార్‌సీపీ

ఏపీఈఆర్‌సీ ఆమోదం మేరకే...

సర్దుబాటు తప్పదు. నిబంధనల మేరకే సర్దుబాటు చార్జీలు వసూలు చేస్తున్నాం. బిల్లులో వాటిని జత చేశాం. ఏపీఈఆర్సీ ఆమోదం తర్వాతే ఈ నిర్ణయం జరిగింది. ట్రూ అప్‌ చార్జీలు త్వరలోనే ముగుస్తాయి. – ఎస్‌ఈ, రమణ,

పర్యవేక్షక ఇంజినీరు, ఆపరేషన్‌

వినియోగం తగ్గినా..

అక్టోబర్‌ నెలలో 113 యూనిట్లకు రూ.499 బిల్లు వచ్చింది. నవంబర్‌ నెలలో 93 యూనిట్లకే రూ.478 బిల్లు వచ్చింది. కరెంట్‌ వినియోగం తగ్గినప్పటికీ బిల్లు మాత్రం పెరిగింది. ఈ చలికాలంలోనే ఇలా బిల్లులు వస్తుంటే... ఇక వేసవి కాలంలో విద్యుత్‌ వినియోగం పెరిగి కరెంటు బిల్లు ఇంకా ఎంత పెరుగుతుందోనని ఆందోళనగా ఉంది. – నాగేశ్వరి, కానపల్లె, ప్రొద్దుటూరు మండలం

బిల్లుల పెంపు దారుణం

ప్రజాభిప్రాయం తీసుకోకుండానే విద్యుత్‌ చార్జీల పెంపునకు ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేయడం దారుణం. ఎన్నికలకు ముందు విద్యుత్‌ చార్జీలు పెంచబోమని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక 6 నెలల కాలంలో రెండు సార్లు పెద్ద మొత్తంలో విద్యుత్‌ భారం మోపడం సరైంది కాదు.

–వి.వీరశేఖర్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు

ఎలా కట్టాలి..

గత నెల వరకూ మా ఇంటికి రూ.350–450లు వరకూ కరెంట్‌ బిల్లు వచ్చేది. ఈ నెల రూ.650లు బిల్లు వచ్చింది. ఒక్క నెలలోనే ఇంత కరెంట్‌ బిల్లు పెరిగితే ఎలా కట్టాలి. ఈ ప్రభుత్వంలో ఎలాంటి కరెంట్‌ బిల్లులు పెంచమని చెప్పిన పాలకులు ఇప్పుడు కరెంట్‌ బిల్లులు పెంచటం ఏ మాత్రం బాలేదు. ఇప్పటికై నా పెంచిన కరెంట్‌ బిల్లులను తగ్గించాలి. –ఎస్‌కే ఉసేన్‌ బీబీ, గృహిణి, దువ్వూరు

No comments yet. Be the first to comment!
Add a comment
బాదుడే...బాదుడు! 1
1/5

బాదుడే...బాదుడు!

బాదుడే...బాదుడు! 2
2/5

బాదుడే...బాదుడు!

బాదుడే...బాదుడు! 3
3/5

బాదుడే...బాదుడు!

బాదుడే...బాదుడు! 4
4/5

బాదుడే...బాదుడు!

బాదుడే...బాదుడు! 5
5/5

బాదుడే...బాదుడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement