ఆగిన పనులు.. సాగేనా!
అరకొరగా ల్యాబ్ సౌకర్యం
ఇక్కడ అరకొరగా ల్యాబ్ సౌకర్యాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అధ్యాపకులు నాణ్యమైన బోధన అందిస్తున్నారు. దీంతో మంచి ఫలితాలను సాధిస్తున్నాం. సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం. – జె.చందన
(బీఎస్సీ హానర్స్ బాటనీ విద్యార్థిని), వేంపల్లె
బాలికలకు హాస్టల్ వసతి కల్పించాలి
డిగ్రీ కళాశాలలో 80 శాతం మహిళలు ఉన్నందున హాస్టల్ వసతిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాలలో హాస్టల్‌ను ఏర్పాటు చేయాలి. అలాగే ఆటస్థలం, జిమ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. – నవనీత(బీఎస్సీ విద్యార్థిని), వేంపల్లె
త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలి
అసంపూర్తిగా ఉన్న ప్రభు త్వ డిగ్రీ కళాశాల తరగతి భవనాలు త్వరగా పూర్తి చేయాలి. అరకొరగా ల్యాబ్ సౌకర్యం ఉన్నందున విద్యా ర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకులతో ఉత్తమ బోధన అందిస్తున్నాం. త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాం. –సి.యోగాంజనేయులు,
(కళాశాల ప్రిన్సిపాల్), వేంపల్లె
● 2020–21లో వేంపల్లెలోప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు
● అర్థాంతరంగా నిలిచిపోయిన తరగతి భవనాలు
● అరకొరగా ల్యాబ్ సౌకర్యం
● రెగ్యులర్ అధ్యాపకుల్లేక విద్యార్థుల అవస్థలు
వేంపల్లె: విద్యారంగంలోని సమస్యలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే నాడు–నేడు పనులను పక్కనబెట్టగా.. తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారో తెలియని పరిస్థితి. తాజాగా పలుచోట్ల నిర్మాణంలో ఉన్న కళాశాల భవనాలను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధే కూటమి నేతలకు లేకుండా పోయింది. మండల కేంద్రమైన వేంపల్లెలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలే ఇందుకు నిదర్శనం. 2020–21లో ఇక్కడ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. బీఎస్సీ, బీఏ, బీకాం గ్రూపులను ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నారు.
పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్య దూరం కాకూడదనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వేంపల్లె జెడ్పీటీసీ ఎం.రవికుమార్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన వెంటనే కళాశాల మంజూరు చేసి నిధులు కేటాయించారు. గండి రోడ్డులోని వైఎస్ రాజారెడ్డి నగర్ గుట్టపైన 15ఎకరాల సువిశాలమైన ప్రదేశం, ప్రశాంత వాతావరణంలో రూ.20కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన తరగతి భవనాలు, ల్యాబ్‌లు, ప్రహరీ గోడలు, రూ 10.కోట్లతో ఇంటర్నల్ రోడ్లు, ఆడిటోరియంలు అత్యాధునిక డిజైన్లతో నూతనంగా నిర్మించేలా నిధులు మంజూరు చేశారు. 55శాతం నిర్మాణ పనులు పూర్తి చేశారు.
● ఆ తర్వాత ఎన్నికలు రావడం.. కూటమి ప్రభు త్వం అధికారంలోకి రావడంతో పనులు అటకెక్కాయి. సదరు కాంట్రాక్టర్‌కు రూ.2.40కోట్లు బిల్లులు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. దీంతో తరగతి భవన నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం వేంపల్లెలోని పాత జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల భవనాలలో నిర్వహిస్తున్నారు. అరకొర ల్యాబ్ సౌకర్యాలు, మౌలిక వసతులు సరిగా లేక ఇబ్బందుల నడుమ విద్యాభ్యాసం సాగుతోంది. ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన సిబ్బంది నియామకాలు కూడా జరగలేదు.
పీఎం–యుఎస్‌హెచ్‌ఏ స్కీం కింద ఎంపిక:
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 80 శాతం విద్యార్థినులు ఉండటంతో ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ కింద కళాశాల ఎంపికై ంది. అందుకు డీపీఆర్ పంపా లని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు సైతం వచ్చా యి. పైగా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్పొరేట్ కళాశాలలో దీటుగా పోటీ పడుతోంది. 2020–21 విద్యా సంవత్సరంలో 75 శాతం, 2021–22లో 80 శాతం, 2022–23లో 82 శాతం, 2023–24లో 83 శా తం ఫలితాలు వచ్చాయి. ఇంకా మెరుగైన వసతులు, శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులను నియమిస్తే వంద శాతం ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంది. ఈ దిశగా జిల్లా ఉన్నతాధికారులు, కూటమి నేతలు స్పందించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా..
రెండేళ్లుగా నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా డిగ్రీ కళాశాల దినదినాభివృద్ధి చెందుతోంది. 2021లో 13 మంది విద్యార్థులు, 2022లో 69 మంది విద్యార్థులు తమ నైపుణ్యతను సాధించి పెద్ద, పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు. ప్లేస్‌మెంట్ ఆఫీసర్ టీ.వీ.అరవింద్ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది విద్యార్థులకుపైగా ఉద్యోగాలతోపాటు ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment