భూ రీ సర్వేను పరిశీలించిన జేసీ
దువ్వూరు(చాపాడు) : దువ్వూరు మండల పరిధిలోని ఇడమడక గ్రామంలో జరుగుతున్న భూ రీ సర్వేను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ పరిశీలించారు. ఇడమడక గ్రామాన్ని ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని భూ రీ సర్వే చేపట్టింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రీ సర్వేను జేసీ అదితిసింగ్, ఆర్డీఓ సాయిశ్రీ పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు భూ సర్వేను గడుపులోగా పూర్తి చేయాలని జేసీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అక్బర్ బాషా, రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులను
పరిశీలించిన జేసీ..
మండల వ్యాప్తంగా ఇటీవల జరిగిన రెవెన్యూ గ్రామ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులను బుధవారం జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానిక రెవెన్యూ సిబ్బందికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment