సీమకు ద్రోహం చేస్తున్నారు
జమ్మలమడుగు: తరతరాలుగా రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని.. ప్రస్తుత కూటమి చర్యలు కూడా అలాగే ఉన్నాయని రాయలసీమ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు ప్రతాపరెడ్డి మండిపడ్డారు. కడపలో స్టీల్‌ప్లాంట్‌ను నిర్మిస్తామని చెప్పి ప్రస్తుతం అనకాపల్లిలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తా మని చెప్పడం రాయలసీమకు తీవ్రమైన అన్యా యం చేయడమే ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక ఐటీఐ ఆవరణలో విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో స్టీల్ ఫ్లాంట్ నిర్మాణం చేసి.. ఈ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన, చిత్తశుద్ధి పాలకులకు కనిపించడం లేదని విమర్శించారు. రాయలసీమ ప్రాంత వాసులకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాయలసీమ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment