●వంట గదుల పరిశీలన
జమ్మలమడుగు: మండల పరిధిలోని మూడు పాఠశాలల్లో వంట గదులను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ పరిశీలించారు. బుధవారం సాయంత్రం మండల పరిధిలోని దేవగుడి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, మోరగుడి, బాలుర ఉన్నత పాఠశాలల్లో వంట గదులను పరిశీలించారు. మండలంలోని పాఠశాలలకు వంటలు తరలించేందుకు సెంట్రల్ వంట గదులను ఏర్పాటు చేయబోతున్నామని అందుకోసం పరిశీలన చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ మీనా క్షి, ఆర్డీఓ సాయిశ్రీ, ఎంఈఓ వెంకటరమణరెడ్డి చంద్రశేఖర్‌రావు తహసీల్దార్ శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment